అన్వేషించండి

Law Nestham Scheme: లా నేస్తం నిధులు విడుదల, వారికి అకౌంట్లలో జమ చేసిన సీఎం జగన్

Law Nestham Scheme: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న జూనియర్ లాయర్లకు నెలకు రూ.5వేలు ప్రభుత్వం స్టైఫండ్ గా అందిస్తుంది. దీనికి వయో పరిమితి ఉంది. మూడేళ్లపాటు ఇలా స్టైఫండ్ అందిస్తారు.

AP CM YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ ఈరోజు లా నేస్తం నిధులు విడుదల చేశారు. 2807మంది న్యాయవాదులకు 2023-24 సంవత్సరానికి సంబంధించి రెండో విడత లా నేస్తం నిధులు విడుదల చేశారు. ఆరు నెలలకు సంబంధించి వారికి ఆర్థిక సాయాన్ని అకౌంట్లలో జమ చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 6069 మంది న్యాయవాదులకు మేలు జరిగిందని చెప్పారు జగన్. నాలుగున్నరేళ్ల కాల వ్యవధిలో వైసీపీ ప్రభుత్వం మొత్తం రూ.49.51 కోట్లు వారికి అందజేసిందని వివరించారు. 

జూనియర్ న్యాయవాదులకు అండగా..
న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునేవారికి, కెరీర్ ప్రారంభించేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు సీఎం జగన్. అందుకే వారికోసం ఈ పథకం ప్రారంభించామన్నారు. జూనియర్ న్యాయవాదులు వారి కాళ్లపై వారు నిలబడేందుకు వీలుగా ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం లాయర్లకు ఏ రకంగా తోడుగా నిలబడుతోందో, పేద వాడి పక్షాన వారు కూడా అలాగే ఔదార్యం చూపిస్తూ, వారికి మంచి చేయాలని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఆ విధంగా మసలుకోవాలని ప్రతి అడ్వొకేట్ సోదరుడిని, చెల్లెమ్మను ప్రభుత్వం తరపున అర్థిస్తున్నానని చెప్పారు జగన్. 

లా నేస్తం ఇలా..
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న జూనియర్ లాయర్లకు నెలకు రూ.5వేలు ప్రభుత్వం స్టైఫండ్ గా అందిస్తుంది. దీనికి వయో పరిమితి ఉంది. మూడేళ్లపాటు ఇలా స్టైఫండ్ అందిస్తారు. అంటే అర్హులైన జూనియర్ లాయర్లకు మూడేళ్లలో గరిష్టంగా 1.80 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. తాజాగా లా నేస్తం నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు స్టైఫండ్ విడుదల చేశారు. ఈ ఏడాది జులై నుంచి డిసెంబర్‌ వరకు 6 నెలల కాల వ్యవధికి ఒక్కొ­క్కరికి రూ.30 వేలు సాయం అందించారు. 

లాయర్లకోసం ఏమేం చేస్తున్నామంటే..?
రూ.100 కోట్లతో అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశామని చెప్పారు సీఎం జగన్. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ కార్యకలాపాలు నడుస్తాయని, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరూ ఇందులో సభ్యులుగా ఉంటారని చెప్పారు సీఎం జగన్. కొవిడ్ సమయంలో ఈ ట్రస్ట్ ద్వారా లాయర్లకు మేలు జరిగిందని, 643 మందికి కొవిడ్ టైమ్ లో.. రూ.52 లక్షల సాయం చేశామని వివరించారు. 7,733 మంది లాయర్లకు రూ.11.56 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా రూ.11.41 కోట్లు చెల్లించామని చెప్పారు. 

లా నేస్తం లాంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలులో లేకపోయినా.. సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ లాయర్లకు అండగా నిలబడ్డారని చెబుతున్నారు వైసీపీ నేతలు. సమాజంలోని ప్రతి వర్గానికి తమ ప్రభుత్వ హయాంలో మంచి జరుగుతోందని వివరించారు. అన్ని వర్గాలకు అండగా నిలబడేందుకు సీఎం జగనన్ ఇలాంటి కార్యక్రమాలను రూపొందించారని, కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా ఆర్థిక సాయం విషయంలో వెనకడుగు వేయలేదని వివరిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో మాత్రం వైసీపీ ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయడం లేదని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. 

టాప్ హెడ్ లైన్స్

Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget