అన్వేషించండి

AP Cabinet : అవ్వా, తాతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - జనవరి ఒకటి నుంచి వృద్ధాప్య పెన్షన్ రూ. 2750 !

వృద్ధాప్య పెన్షన్లను జనవరి ఒకటో తేదీ నుంచి రూ. 2750కి పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


AP Cabinet : ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పెన్షన్లను పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మేనిఫెస్టోలో పెన్షన్ల పెంపుదల హామీకి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సామాజిక పెన్షన్లు 2750 కి పెంచి 2023 జనవరి ఒకటో తేదీ నుంచే పంపిణీ చేయాలని నిర్ణయించారు. చ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్‌ పెంచనున్నారు. ఫలితంగా 62.31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది. కొత్తగా ప్రభుత్వం మంజూరుచేసిన పెన్షన్లు 2.43లక్షలతో కలిపితే మొత్తంగా ఇస్తున్న పెన్షన్లు 64.74 లక్షలకు చేరాయి. దీంతో పెన్షన్లకు నెలకు అందిస్తున్న మొత్తం రూ.1786 కోట్ల వ్యయం. గత ప్రభుత్వం  రూ. రెండు వేల పెన్షన్ ఇచ్చేది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మూడు వేలకు పెంచుకుంటూ వెళ్తానని హామీ ఇచ్చారు. అలా మొదట ప్రమాణ స్వీకారం చేసిన రోజున రూ. 250 పెంచారు. ప్రతీ ఏటా రూ.250 పెంచుతానని హామీ ఇచ్చారు. గత ఏడాది జనవరిలో పెంచారు.

వచ్చే నెలలో పెంపుతో పెన్షన్ 2750 అవుతుంది. ఆ తర్వాత 2014 జనవరికి 3000 వేలు చేస్తారు. దాంతో ఎన్నికల హామీ పూర్తి చేసినట్లు అవుతుంది. ఇందుకోసం రూ.130.44 కోట్లు నెలకు అదనపు వ్యయం వెచ్చింనుంది. దీంతో సుమారు నెలకు రూ.1720 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో నెలకు పెన్షన్లు కోసం చేసిన ఖర్చు కేవలం రూ.400 కోట్లు కాగా, ప్రస్తుతం దీనికి నాలుగున్నరరెట్లు అదనంగా జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది. నవరత్నాలు అర్హులైన పేదలందరికీ సంక్షేమపథకాలు అమల్లో భాగంగా వివిధ కారణాల వల్ల మిగిలి పోయిన, కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారులకు ఏడాదికి రెండు దఫాలుగా లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో భాగంగా వీటి మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది..

అర్హుడైన ఏ ఒక్క లబ్ధిదారుడూ మిగిలిపోకూడదన్న తపనతో పొరపాటున ఏ ఒక్కరైన మిగిలిపోతే వారికి మరో అవకాశం కల్పించి, పరిశీలించి అర్హులైన వారికి అందాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. డిసెంబరు 27న 2.51 లక్షల మందికి రూ.403 కోట్ల మేరకు లబ్ధి చేకూరనుంది. దీంతో పాటు అదనంగా 2.43 లక్షల పెన్షన్లు, 44,543 రైస్‌ కార్డులు, 14,441 ఆరోగ్యశ్రీ కార్డులు, 14,531 ఇళ్ల పట్టాలు, రూ.65 కోట్ల విలువైన సస్పీసియస్‌ అకౌంట్‌లో ఉన్న బీమా క్లెయింలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

భారీా పెట్టుబడుల ప్రతిపాదలనకు కేబినెట్ ఆమోదం 

కేబినెట్ సమావేశంలో  SIPB ఆమోదించిన విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదాని,షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ నెలకొల్పే ప్రాజెక్టులు కడప జిల్లాలో భారీ పెట్టుబడులు పెట్టనున్నాయి. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కూడా ఏబీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ తెలిపింది.వీటన్నింటికీ కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. 

ఎనిమదో తరగతి విద్యార్థులకు ఈ కంటెంట్ ఇచ్చేందుకు నిర్ణయం 

అలాగే  నాడు-నేడు ద్వారా స్కూల్స్ లో టీవీ ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.  ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ కంటెంట్ అందించాలని నిర్ణయించింది. గతంలో బైజూస్ ద్వారా ట్యాబ్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు ఈ కంటెంట్ .. బైజూస్ యాప్ ద్వారా ఇస్తారా లేకపోతే..  ట్యాబ్‌లు పంపిణీ చేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని చెప్పినా ఇంత వరకూ పంపిణీ చేయలేకపోయారు. అదే సమయంలో ఉపాధ్యాయులకు బోదనేతర విధుల రద్దుకు జారీ చేసిన జీవో కు  మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

మండూస్ తుపాను సహాయ చర్యలపై చర్చ 

ఇక  NTR జిల్లా వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరు కు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  1301.68చ.కీమీ.పరిధితో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ ఆదారిటీ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపే ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్ చట్టంలో సవరణలకు కూడా ఆమోదం తెలిపారు. మాండూస్‌ తుపాను ప్రభావంపై కేబినెట్‌ చర్చించినట్లుగా తెలుస్తోంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget