AP Budget Session 2024 Live: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న బుగ్గన
AP Budget Live: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది.

Background
AP Budget 2024 News Live: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు (ఫిబ్రవరి 7) తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉదయం 11 గంటలకు నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయ్యే ఈ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. ఉదయం 8 గంటలకు సమయంలో సచివాలయం మొదటి బ్లాక్‌లో ఈ భేటీ జరగనుంది.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఉదయం 9 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
సోమవారం (ఫిబ్రవరి 5) నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఉభయసభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి.
మంగళవారం ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయని సీఎం జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.15వేలకోట్లు కూడా ఇవ్వలేదని.. పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదన్నారు. ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌజ్ ఉండాలిఅలాంటి పవర్‌హౌజ్ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవన్నారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయాం .. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది ..అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నానన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరం .. ఓ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించారు.
అన్నపూర్ణ ఆంధ్ర లక్ష్యంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టాం: బుగ్గన
రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి వ్యవసాయంలో గణనీయమైన ఉత్పత్తి సాధించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ సమగ్ర వ్యూహాన్ని రూపందించింది. దీనిలో భాగంగా ధరల స్థిరీకరణ నిధి, పంట భీమా, ఇన్‌పుట్ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం లభించింది. వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద లక్షా 60 కౌలుదారులకు, 93 వేల అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు 53 లక్షల 53 వేల మంది ఖాతాల్లో 33,300 కోట్ల రూపాయలు జమ చేసింది.
వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా ద్వారా 54 లక్షల 55 వేల మంది రైతుల ఖాతాల్లో 7, 802 కోట్ల రూపాయల బీమా అందిస్తోంది. వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా 2019 నుంచి 73 లక్షల 88 వేల మంది రైతులకు 1,835 కోట్ల రూపాయలు అందించింది.
10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ఇంటి వద్దే సేవలు అందిస్తోంది. 19 లక్షలకుపైగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు కోతలు లేని రోజువారీ 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తోంది. 2019 నుంచి ఈ పథకం ద్వారా 37,374 కోట్ల రూపాయల సబ్సిడీ అందిస్తోంది. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు పంటలు విక్రయించే వారి కోసం 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద 22 లక్షల 85 వేల మంది రైతులకు 1,977 కోట్ల రూపాయలు అందించింది. మరో 1200 కోట్ల రూపాయలు ఈ నెలలో ఇయ్యబోతోంది.
127కొత్త వైఎస్‌ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంట కోత అనంతర మౌలిక సదుపయాలు కల్పించింది. వైఎస్‌ఆర్ యంత్రసేవా పథకం ద్వారా వ్యవసాయ యంత్రాలను అందిచేయడమే కాకుండా గ్రామ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ అందించారు.
ఉద్యనవన రంగం అభివృద్ధి కోసం 17 లక్షల 27 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా వివిధ పథకాల ద్వారా 4,363 కోట్ల రూపాయలు అందించాం. 2,356 మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను నియమించింది. ంట నిల్వ కోసం 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్ హౌస్‌లును ఏర్పాటు చేసింది.
జగన్న పాల వెల్లువ పథకం ద్వారా రైతులకు లబ్ధి కలిగేలా అమూల్ సంస్థతో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ చేశాం. దీని వల్ల ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కలుగుతోంది.
వైఎస్‌ఆర్ పశు బీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యం కల్పించాం. వైఎస్‌ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా 340 సంచార పశు వైద్యశాలల సేవలను రైతలకు ఇంటి వద్దే అందిస్తున్నాం.
వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా కింద 2 లక్షల 43 వేల మంది మత్స్యకార కుటుంబాలకు చేపల వేట నిషేధ కాలంలో 4 వేల నుంచి పది వేల వరకు ఆర్థిక సాయం చేస్తున్నాం. 20,034 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్ ఆయిల్‌పై లీటర్‌కు 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయల సబ్సిడీ పెంచడం జరిగింది. అకాల మరణానికి గురైన వారికి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నాం.
అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్‌లు నిర్మించాం. గ్రామస్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లు పరీక్షించే సౌకర్యాలను అందించడానికి 35 సమీకృత మత్స్య సంపద ప్రయోగ శాలలు ఏర్పాటు చేసింది. 2000 ఫిష్ ఆంధ్రా రిటైల్ దుకాణాలు స్థాపించాం.
మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించి దాని నియంత్రణ పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశాం. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏప్రిల్ 1, 2022 నుంచి పని చేస్తోంది.
ఈ పథకాలతో మహిళలను మహారాణులను చేస్తున్నాం: బుగ్గన
జనాభాలో సగం మంది సంక్షేమ సాధికరాతకు నోచుకోని ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీనిని గుర్తించి మహిళలకు సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలు ప్రారంభించింది. అందులో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి జెండర్ చైల్డ్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాం. జగనన్న అమ్మ ఒడి పథకం ప్రవేశ పెట్టి అందరికీ విద్య అందేలా చేస్తున్నాం. దీని కింద 43 లక్షల 61 వేల మంది మహిళలకు 26, 067 కోట్ల రూపాయలు అందించాం. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరే విద్యార్థుల సంఖ్య 2019 87.8 శాతం ఉంటే.. 2023 నాటికి అది 98.73శాతానికి పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88 ఉంటే... 2023 నాటికి 79.69కి పెరిగింది.
మహిళా సంఘాల బకాయిలు చెల్లించేందుకు వైఎస్‌ఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశ పెట్టాం. 2019 నుంచి 7 లక్షల 98 వేల స్వయం సహాయ సంఘాలలోని 78 లక్షల 94 వేల మంది మహిళలు ఉపశమనం కల్పించాం. వారికి 25, 571 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాం. వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 4,969 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. 18.36 శాతం గా ఉన్న బకాయిలు దేశంలోనే అతి తక్కువ స్థాయి అయిన 0.17 శాతానికి చేరాయి.
వైఎస్‌ఆర్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలకు 14,129 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. జగనన్న పాలవెల్లువ పథకం కింద 3 లక్షల 60 వేల మంది మహిళలకు డెయిరీ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు 2,697 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. స్త్రీల, పిల్లల భద్రత కోసం దిశా మొబైల్ యాప్‌ను, దిశా పెట్రోల్ వాహనాలను, 26 దిశా పోలీస్ స్టేషన్‌లను ప్రారంభించాం.





















