News
News
X

AP Budget Schemes Wise: ఏపీ బడ్జెట్‌లో పథకాలు, శాఖలవారీ కేటాయింపులు ఇవీ, దీనికి పెద్దపీట!

మొత్తం రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం 2,28,540 కోట్లు

FOLLOW US: 
Share:

ఏపీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం 2,28,540 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.31,061 కోట్లు, రెవెన్యూ లోటు 22,316గా పేర్కొన్నారు. ద్రవ్యలోటు రూ.54,587 కోట్లు కాగా, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం, ద్రవ్యలోటు 1.54 శాతంగా చూపించారు.

బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ కేటాయింపులు ఇలా ఉన్నాయి

  • వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక రూ.21,434.72 కోట్లు
  • వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రూ.15,882 కోట్లు
  • వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు
  • జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు
  • జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు
  • వైఎస్సార్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు
  • డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రూణాల కోసం రూ.1000 కోట్లు
  • రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు
  • వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు
  • జగనన్న చేదోడు రూ.35 0 కోట్లు
  • వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు
  • వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
  • వైఎస్సార్ మత్స్యకారు భరోసా రూ.125 కోట్లు
  • మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు
  • రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు
  • లా నేస్తం రూ.17 కోట్లు
  • జగనన్న తోడు రూ.35 కోట్లు
  • ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు
  • వైఎస్సార్ కల్యాణమస్తు రూ.200 కోట్లు
  • వైఎస్సార్ ఆసరా రూ.6,700 కోట్లు
  • వైఎస్సార్ చేయూత రూ.5, 000 కోట్లు
  • అమ్మఒడి రూ.6,500 కోట్లు
  • జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు

శాఖలవారీ కేటాయింపులు ఇలా..

  • వ్యవసాయ రంగం - రూ.11,589.48 కోట్లు
  • విద్యుత్‌ శాఖ - రూ.6,546.21 కోట్లు
  • వైద్య ఆరోగ్య శాఖ - రూ.15,882.34 కోట్లు
  • పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి - రూ.15,873.83 కోట్లు
  • రవాణా, రోడ్లు, భవనాలు - రూ.9,118.71 కోట్లు
  • పాఠశాల సెకండరీ విద్య - రూ.29,690.71 కోట్లు
  • కాపు కార్పొరేషన్‌ - రూ.4,887 కోట్లు
  • ఈబీసీ కార్పొరేషన్‌ - రూ.6,165 కోట్లు
  • ఎస్సీ కార్పొరేషన్‌ - రూ.8,384.93 కోట్లు
  • ఎస్టీ కార్పొరేషన్‌ - రూ.2,428 కోట్లు
  • బీసీ కార్పొరేషన్‌ - రూ.22,715 కోట్లు
  • క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ - రూ.115.03 కోట్లు

టీడీపీ సభ్యుల సస్పెన్షన్

బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న టైంలో కాసేపు గందరగోళం నెలకొంది. బడ్జెట్‌ కాపీని ఆర్థికమంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చదవడం మొదలు పెట్టిన వెంటనే తప్పుడు లెక్కలు అంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో స్పీకర్, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం నడిచింది. అప్పుడే సీఎం జగన్ లేచి... వాళ్లను బయటకు పంపించేసి సభా కార్యక్రమాలు సజావుగా సాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కావాలనే రాద్దాంతం చేయాలనే టీడీపీ లీడర్లు నిరసన చేస్తున్నారని మండిపడ్డారు. 

తర్వాత చాలా సమయం టీడీపీ నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ లీడర్లు వినలేదు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ మాట్లాడుతూ... బడ్జెట్ వినడం ఇష్టం లేకపోతే వాకౌట్ చేయాలని టీడీపీ సభ్యులకు సలహా ఇచ్చారు. లేకుంటే బడ్జెట్ విన్న తర్వాత బడ్జెట్‌పై డిస్కషన్ సమయంలో కావాల్సినంత టైం ఇస్తామంటూ చెప్పారు. అయినా టీడీపీ లీడర్లు వెనక్కి తగ్గలేదు. దీంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మట్లాడుతూ... టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు. వారిని బయటకు వెళ్లిపోవాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. 

Published at : 16 Mar 2023 12:07 PM (IST) Tags: Buggana Rajendranath AP Budget news AP Budget 2023-24 Budget funds allotment Funds in AP Budget

సంబంధిత కథనాలు

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Lokesh on Sand Mafia: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఇసుక దందా ఆరోపణలు, టిప్పర్ల ముందు లోకేష్ సెల్ఫీలు వైరల్

Lokesh on Sand Mafia: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఇసుక దందా ఆరోపణలు, టిప్పర్ల ముందు లోకేష్ సెల్ఫీలు వైరల్

MP Nandigam Suresh : పథకం ప్రకారమే దాడి, ఆదినారాయణ రెడ్డి మనుషులే కవ్వించారు- ఎంపీ నందిగం సురేష్

MP Nandigam Suresh : పథకం ప్రకారమే దాడి, ఆదినారాయణ రెడ్డి మనుషులే కవ్వించారు- ఎంపీ నందిగం సురేష్

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?