అన్వేషించండి

Purandeshwari : 22వ తేదీ కూడా సెలవు ప్రకటించాలి - పురందేశ్వరి డిమాండ్

Andhra News : ఏపీలో 22వ తేదీ కూడా సెలవు ప్రకటించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఆ రోజు పలు రాష్ట్రాలు సెలవు ప్రకటించాయన్నారు.

AP BJP president Purandeshwari : ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలు సెలవు ఇచ్చాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. దేశంలో గొప్పగా జరగబోతోన్న ఈ వేడుకలకి యూపీ, గోవా, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు, జనవరి 22 న అందరూ  పండుగ జరుపుకోవాలని సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.     

రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటమని పేర్కొన్న పురంధేశ్వరి.. ఈ నెల 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు. 21వ తేదీ వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక దురుద్దేశం ఉందని అర్థం అవుతుందని విమర్శించారు. 22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదన్న ఆమె.. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయని పురందేశ్వరి గుర్తుచేశారు.     

  స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకుంది.  కి ఏపీలో స్కూళ్లు సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 19న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, సెలవులను మరో మూడ్రోజులు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో పాఠశాలలు జనవరి 22న పునఃప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ పేర్కొన్నారు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అయితే టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు అడిగితే సెలవులు ఇచ్చేస్తారా అన్న సందేహం చాలా మందికి వచ్చింది.                            

తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సంక్రాంతి సెలవుల్ని పొడిగించినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. 'ఆడుదాం ఆంధ్రా' కోసం సెలవులు పొడిగించినట్లు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా జనవరి 10న ప్రారంభమైన మండల స్థాయి ఆటల పోటీలు జనవరి 20తో ముగియనున్నాయి. క్రికెట్, ఖోఖో, కబడ్డీ వంటి పోటీల్ని చాలా మండలాల్లో ప్రభుత్వ బడులకు అనుబంధంగా ఉన్న క్రీడా మైదానాల్లో, పాఠశాలల ఆవరణల్లో నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనవరి 19 నుంచి బడులు తెరిస్తే  పోటీలతోపాటు తరగతుల నిర్వహణకూ అవరోధమని అధికారులు భావించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సెలవులు పొడిగింపునకు ప్రభుత్వ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.                        

మరో వైపు ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం పొడిగించగా.. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు జనవరి 18 నుంచి తెరచుకున్నాయి. తెలంగాణలోని స్కూళ్లకు జనవరి 12 నుంచి 17 వరకు సెలవులను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటర్ కాలేజీలకు నాలుగురోజులు సెలవులు ఇవ్వగా జనవరి 17న కాలేజీలు ప్రారంభమయ్యాయి.  ఇప్పుడు బీజేపీ ఇరవై రెండో తేదీ కూడా సెలవు ఇవ్వాలని డిమాండ్  చేస్తోంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.     

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget