అన్వేషించండి

AP BJP : ద్రౌపది ముర్ముకు ఓటెయ్యాలని వైసీపీని కోరలేదు, సత్యకుమార్ కామెంట్స్ పై బీజేపీ అధిష్ఠానం సీరియస్!

AP BJP : ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలో దుమారం రేగింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు తాము కోరలేదని సత్యకుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తప్పుబట్టారు.

AP BJP : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన ఉన్న సమయంలో సత్యకుమార్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో ఏకంగా కేంద్రమంత్రి రంగంలోకి దిగి సత్యకుమార్ వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ సత్యకుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైసీపీని తాము అడగలేదని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.  ఈ కామెంట్స్ ను షేకావత్ తప్పుపట్టారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైసీపీని తాము అడిగినట్టుగా కేంద్రమంత్రి షేకావత్ స్పష్టం చేశారు. ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం జగన్ కూడా ఆహ్వానించామన్నారు. అయితే కేబినెట్ మీటింగ్ వల్ల ఆయన హాజరుకాలేకపోయారని వైసీపీ నుంచి పార్లమెంటరీ నేతలు పాల్గొన్నారని గుర్తుచేశారు. సత్యకుమార్ మాటలతో పార్టీకి సంబంధం లేదన్నారు. ఆ కామెంట్స్ ఆయన వ్యక్తిగతం అని తేల్చేశారు. 

సత్యకుమార్ కామెంట్స్ 

విజయవాడలో ఆదివారం జరిగిన ఓ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పాల్గొ్న్నారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మీడియాకు వివరిస్తూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను మండిపడ్డారు. సెప్టెంబర్ 25 నుంచి ఏపీలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలా? లేదా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ అభివృద్ది గురించి మాట్లాడే అర్హత వైసీపీ లేదన్నారు. వైసీపీ హయాంలో ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వైసీపీ ప్లీనరీలో మాత్రం ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తున్నట్టుగా చెప్పారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు ఖర్చు చేస్తున్న నిధులు 60 నుంచి 90 శాతం కేంద్రం నుంచే వస్తున్నాయన్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటెయ్యాలని బీజేపీ ఎప్పుడూ వైసీపీని కోరలేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగింది. వైసీపీ మద్దతు కోరామని చెప్పుకొచ్చారు. 

రేపు ఏపీకి ద్రౌపది ముర్ము 

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రేపు(మంగళవారం) ఏపీకి రానున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు  గన్నవరం  విమానాశ్రయానికి ఆమె చేరుకుంటారు. 3 గంటలకు  వైసీపీ ఎమ్మెల్యేలు,  ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ ను ద్రౌపది ముర్ము కలవనున్నారు. ఏపీ నుంచి కర్ణాటక వెళ్లే  ముందు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ముర్ము కలవనున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Vizianagaram ZP Elections: మజ్జి సహస్ర బీసీ కాదంటూ వైసీపీ ఫిర్యాదు.. చిన్న శ్రీనుకు పెద్ద టెన్షన్- మరోవైపు బొత్సకు షాక్!
మజ్జి సహస్ర బీసీ కాదంటూ వైసీపీ ఫిర్యాదు.. చిన్న శ్రీనుకు పెద్ద టెన్షన్- మరోవైపు బొత్సకు షాక్!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
CM Chandrababu:సెమీకండక్టర్‌ రంగంలో ఏపీకి కేంద్రం భరోసా, రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌
సెమీకండక్టర్‌ రంగంలో ఏపీకి కేంద్రం భరోసా, రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌
YS Family Property Issue: యలహంక ప్రాపర్టీపై ముదిరిన వివాదం.. వైఎస్ జగన్ 'నా ఇల్లు' వ్యాఖ్యలపై షర్మిల వర్గం ఆగ్రహం!
యలహంక ప్రాపర్టీపై ముదిరిన వివాదం.. వైఎస్ జగన్ 'నా ఇల్లు' వ్యాఖ్యలపై షర్మిల వర్గం ఆగ్రహం!

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Embed widget