అన్వేషించండి

BJP - Janasena : పవన్ - చంద్రబాబు భేటీ సాధారణమే - జనసేనతో పొత్తు ఉంటుందంటున్న బీజేపీ!

జనసేన పార్టీతో పొత్తు ఉంటుందని ఏపీ బీజేపీ స్పష్టం చేసింది. చంద్రబాబు - పవన్ భేటీ సాధారణమేనని భావిస్తోంది.

BJP - Janasena   :  ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలపై బీజేపీ పెద్దగా కంగారు పడటం లేదు. తమపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి.. వ్యూహం మార్చుకుంటున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించి చంద్రబాబుతో సమావేశం అయినప్పటికీ బీజేపీ నేతలు ఇంకా పవన్ కల్యాణ్‌ తమతోనే ఉన్నారని నమ్ముతున్నారు. చంద్రబాబునాయుడు.. పవన్ కల్యాణ్‌తో భేటీ కేవలం సంఘిభావం కోసమే జరిగిందని.. అలాంటి సమావేశాన్ని చంద్రబాబు కంటే ముందే సోము వీర్రాజు నిర్వహించారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. సోము వీర్రాజుకు ఏపీ వ్యవహారాలను పర్యవేక్షించే కొంత మంది బీజేపీ పెద్దలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో పరిణామాలపై వారు విశ్లేషించారు. 

పవన్  కల్యాణ్ - చంద్రబాబు భేటీపై ఆరా తీసిన బీజేపీ హైకమాండ్ 

పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ .. తాము బీజేపీతో కటీఫ్ చెబుతున్నానని ఎప్పుడూ ప్రకటించలేదని.. నిన్నటి సమావేశంలో.. రోడ్ మ్యాప్‌ ఆలస్యంపై అసంతృప్తి, బలంగా కలిసి ముందుకు వెళ్లలేకపోయామన్న ఆవేదన  మాత్రమే వ్యక్తం చేశారన్నారు. అందుకే పవన్ కల్యాణ్ విషయంలో ఎవరూ తొందరపడి వ్యతిరేక వ్యాఖ్యలు  చేయవద్దని ఆయన పొత్తులో ఉన్నట్లుగానే మాట్లాడాలని పార్టీలోని అన్ని స్థాయిల నేతలకు సమాచారం పంపారు. ఈ మేరకు బీజేపీ నేతలంతా.. తాము జనసేనతో పొత్తులోనే ఉన్నామని.. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు. 

చంద్రబాబు - పవన్ భేటీ సాధారణమేనని ఢిల్లీ పెద్దల భావన

గత ఎన్నికల్లో పరాజయం తర్వాత జనసేన పార్టీ అనూహ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది. సాధారణంగా రాజకీయ పార్టీలు ఏదైనా ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే పొత్తుల గురించి ఆలోచిస్తాయి. కానీ పవన్ కల్యాణ్ ఎలాంటి ఎన్నికలు లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత వారి పోరాటం కలసి కట్టుగా సాగలేదు. బీజేపీలో కొంత మంది నేతలు వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఫిర్యాదును జనసేన పార్టీ నాయకులు హైకమాండ్‌కు చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. కారణం ఏదైనా కానీ జనసేన - బీజేపీ కలిసి కట్టుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. తిరుపతి ఉపఎన్నికల్లో తప్ప.. బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో జనసేన పార్టీ బేజీపికి మద్దతివ్వలేదు. 

జనసేనతో పొత్తు ఉంటుందన్న బీజేపీ నేతలు 

ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ బిజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ రాజకీయాల కోసం వైఎస్ార్సీపీతో కేంద్ర పెద్దలు సన్నిహితంగా ఉండటం.. రాష్ట్ర సమస్యలపై పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తులు కూడా పట్టించుకోలేని ఫీల్ కావడంతో ఆయన దూరం జరుగుతూ వస్తున్నారు. రెండు రోజుల కిందట.. ప్రతీ దానికి తాము ఢిల్లీకి వెళ్లలేమని.. రాష్ట్రంలోనే తేల్చుకుంటామన్నారు. నిన్న బీజేపీ అనుకున్నట్లుగా స్పందించడం లేదని.. వ్యూహం మార్చుకుంటామని అన్నారు. అయితే బీజేపీ మాత్రం ఈ విషయాలను సానుకూలంగానే డీల్ చేస్తోంది. . దీంతో ఇప్పటికిప్పుడు బీజేపీ వైపు నుంచి ఎలాంటి  దూకుడైన ప్రకటనలు ఉండవని భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget