అన్వేషించండి

Vasudeva Reddy Arrest: ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు!

Andhra Pradesh News | మొన్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెెస్టయ్యాడు.

AP Beverages Corporation Ex MD Vasudeva Reddy Arrest | అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఇటీవల ఏపీలో అరెస్టుల పర్వం మొదలైంది. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. తాజాగా ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఐడీ అధికారులు వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారని సమాచారం. ఏపీలో మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఓ అజ్ఞాత ప్రాంతంలో ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం విక్రయాల విషయంపై వాసుదేవరెడిపై భారీ అభియోగాలు నమోదయ్యాయి.

వైసీపీ హయాంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పట్లో డిప్యూటేషన్ పై వాసుదేవరెడ్డిని రప్పించారని వార్తలు వచ్చాయి. ఏపీలో మద్యం విక్రయాలు పెంచే బాధ్యత ఆయనకు జగన్ అప్పగించారని టీడీపీ నేతలు గతంలోనే ఆరోపించారు. దాంతో  వాసుదేవరెడ్డి రాష్ట్రంలో డిస్టిలరీలు, డిపోలు, షాపులపై అజమాయిషీ చేశారు. ఇంకా చెప్పాలంటే ఏపీలో జే బ్రాండ్లు తీసుకురావటంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారట. ఏపీలో మద్యంపై ఆదాయాన్ని ముందుగానే తాకట్టు పెట్టి వైసీపీ ప్రభుత్వం వేల కోట్లు అప్పులు తెచ్చిందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి చవిచూసింది. అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు గత ఐదేళ్లలో జరిగిన పాలనలో లోపాలు, అవినీతిపై ఫోకస్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వాసుదేవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లగా.. 2 నెలల తరువాత ఏపీ సీఐడీ ఆయనను అరెస్ట్ చేసింది. వాసుదేవరెడ్డి అరెస్ట్ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 

వైసీపీ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో భారీ అవినీతి జరిగిందని, ఎన్నికల అనంతరం కార్పొరేషన్ ఆఫీసు నుంచి ఫైళ్లు మాయం చేశారని వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది. తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం వాసుదేవరెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడం తెలిసిందే.

ఫైళ్లు తరలించారని వాసుదేవరెడ్డిపై కేసు నమోదు
ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం మెుగులూరుకు చెందిన శివకృష్ణ ఫిర్యాదుతో వాసుదేవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్పొరేషన్ నుంచి ఫైళ్లు తరలిస్తున్నట్లు చూశానని ఆ ఫిర్యాదులో శివకృష్ణ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లో వాసుదేవరెడ్డికి చెందిన  ఓ ఖరీదైన విల్లాలో మూడు రోజులపాటు సోదాలు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన నివాసాలలో సోదాల్లో భాగంగా కీలకమైన డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.   

రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఉద్యోగిగా ఉండే వాసుదేవరెడ్డి డిప్యూటేషన్ పై ఏపీ ప్రభుత్వానికి వచ్చారు. అప్పటి సీఎం వైఎస్ జగన్, వాసుదేవరెడ్డికి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. వైసీపీ నేతలకు సంబంధించిన డిస్టిలరీల నుంచి వచ్చే మద్యాన్ని విక్రయించేలా చూశారని, మద్యం ఆదాయం చూపించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవడంలోనూ వాసుదేవరెడ్డి కీలకంగా వ్యవహరించాలని టీడీపీ నేతలు ఆరోపించారు.

Also Read: రోజా చుట్టూ బిగుస్తున్న క్రీడల ఉచ్చు! అరెస్ట్ చేసే ఛాన్స్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget