Breaking News Live: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- డీసీఎం వ్యాన్, మినీ లారీ ఢీకొని నలుగురు దుర్మరణం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
తెలంగాణలో చలి ఓ మోస్తరుగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చలి తీవ్రత అలాగే ఉంది. రెండు వైపుల నుంచి వీచే గాలులతో ఉదయం వేళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏపీ, యానాంలలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి చలిగాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండనుంది. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాంధ్రలో చలి తీవ్రత అధికంగా ఉంది.
ఈశాన్య, ఉత్తర దిశ నుంచి వీచే గాలులతో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఏజెన్సీ ఏరియాలో చలి ఎక్కువగా ఉంది. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. కళింగపట్నంలో 16.4 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 17.6 డిగ్రీలు, నందిగామలో 17.5 డిగ్రీలు, బాపట్లలో 18.2, అమరావతిలో 18.6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం సాధారణంగా ఉంటుంది. వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండవు. కోస్తాంధ్రతో పోల్చితే చలి తీవ్రత మాత్రం ఇక్కడ చాలా వరకు తగ్గినట్లు వెల్లడించింది. తావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆరోగ్యవరంలో 19 డిగ్రీలు, అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలు, నంద్యాలలో 19.6 డిగ్రీలు, కర్నూలులో 20 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం సాధారణంగా ఉండనుంది. అయితే కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉదయం వేళ కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు పెరిగింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.100 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,200 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,300 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.64,900గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,200 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,300గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,900 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,200 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,300గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,900గా ఉంది.
ప్రకాశం జిల్లాలో ఘోరప్రమాదం- డీసీఎం వ్యాన్, మినీ లారీ ఢీకొని నలుగురు దుర్మరణం
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బేస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై ఎదురెదురుగా డీసీఎం వ్యాన్, మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా నుంచి మిర్చి లోడుతో వెళ్తోన్న డీసీఎం వ్యాన్ ఆవులు, కోడె దూడలతో వస్తున్న మినీ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. 8 కోడె దూడలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లాలో ఘోరప్రమాదం- డీసీఎం వ్యాన్, మినీ లారీ ఢీకొని నలుగురు దుర్మరణం
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బేస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై ఎదురెదురుగా డీసీఎం వ్యాన్, మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా నుంచి మిర్చి లోడుతో వెళ్తోన్న డీసీఎం వ్యాన్ ఆవులు, కోడె దూడలతో వస్తున్న మినీ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. 8 కోడె దూడలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.





















