Breaking News Live: కేరళలో ఈనెల 17, 18 తేదీలలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం రద్దు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 16న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 16న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ఈనెల 17, 18 తేదీలలో రద్దు
శబరిమల దర్శనాలపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భక్తులకు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ఈనెల 17, 18 తేదీలలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
హన్మకొండ జిల్లాలో రైల్వే గేట్ మెన్ పై యువకుడు దాడి.. మద్యం మత్తులో హల్‌చల్
హన్మకొండ జిల్లాలో రైల్వే గేట్ మెన్ పై దాడి జరిగింది. శాయంపేట Lc.No 61 వద్ద మద్యం మత్తులో ఉన్న యువకుడు గేట్ మెన్ రాజు పై ఓ యువకుడు దాడి చేసాడు. ట్రైన్ వస్తుంది అని గేట్ మెన్ చెప్పినా వినకుండా యువకులు గేట్ తెరిచే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గేట్ మెన్‌పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు.