అన్వేషించండి

AP Mandali : వైసీపీకి షాకివ్వనున్న బీజేపీ..! మండలిని రద్దు చేయబోయేది అప్పుడే..!?

వైఎస్ఆర్‌సీపీతో బీజేపీ సంబంధాలు దెబ్బతిన్న మరుక్షణం శాసనమండలిని రద్దు చేసే అవకాశం. ఆ ఆయుధాన్ని తీర్మానం రూపంలో తానే ఇచ్చిన వైసీపీ.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని..  ఇంకా బిల్లుపై నిర్ణయం తీసుకోలేదని ... పరిశీలనలో ఉందని రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి రిజుజు చెప్పుకొచ్చారు. దీంతో  శాసనమండలి అంశం కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లలేదని..  కేంద్రం ఆ అంశాన్ని లైవ్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో  శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత ఉండేది. అయితే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని బిల్లులలకూ టీడీపీ ఆమోదం తెలిపింది కానీ.. రాజధాని బిల్లును మాత్రం తిప్పి పంపింది. సెలక్ట్ కమిటీకి పంపడంతో ఆగ్రహం చెందిన సీఎం జగన్.. శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించారు. 

ఈ మేరకు అసెంబ్లీలో నిబంధనల మేరకు .. మూడింట రెండు వందల మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు. అప్పట్లో శాసనమండలి వల్ల డబ్బులు దండగ తప్ప ప్రయోజనం లేదన్నారు. ఏడాదిలో తమకు మెజార్టీ వస్తుందని తెలుసని అయినప్పటికీ.. రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కానీ ఆ తీర్మానాన్ని కేంద్రం ఇంత వరకూ పట్టించుకోలేదు. ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం బిల్లు రూపంలోకి మార్చి పార్లమెంట్‌లో  ప్రవేశ పెట్టి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందితే శాసనమండలి రద్దవుతుంది. కానీ.. పార్లమెంట్‌లో ఇంత వరకూ ఏపీ శాసనమండలి బిల్లును ప్రవేశపెట్టలేదు. ఆ దిశగా కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే..   శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ వచ్చేసింది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీలతో రాజీనామాలు చేయించి.. వారికి మళ్లీ ఎమ్మెల్సీ పదవులే ఇచ్చారు. అలాగే.. ఖాళీ అయిన ప్రతీ ఎమ్మెల్సీ స్థానంలోనూ వైసీపీ అభ్యర్థికి చాన్సిచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. వాటిని కూడా రేపోమాపో నిర్వహించనున్నారు. దీంతో వైసీపీ బలం మరింతగా పెరుగుతుంది. 

 ఇలాంటి సమయంలో... వైసీపీ శాసనమండలి రద్దు విషయంలో వీలైనంతగా మౌనాన్ని పాటిస్తోంది. తమ ప్రభుత్వం.. మూడింట రెండు వంతుల మెజార్టీతో చేసిన తీర్మానాన్ని గౌరవించాలని అడగడం మానేసింది. ఏపీ సర్కార్ నిర్లిప్తంగా ఉంది కాబట్టి... కేంద్రం కూడా.. ఇప్పుడేమంత అవసరం అనుకుంటోంది. అందుకే పట్టించుకోవడం లేదు. ఇప్పటి పరిస్థితుల్ని బట్టి చూస్తే.. శాసనమండలిని రద్దు చేస్తే.. వైసీపీ నేతల పదవులు ఊడిపోతాయి. ఇది ఆ పార్టీలో కొత్త సమస్యలు సృష్టిస్తుంది. అందేుకే కేంద్రం పై ఒత్తిడి తేవడం లేదు. కానీ బీజేపీ మాత్రం.. దీన్నో అవకాశంగా ఉపయోగించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడంటే...  బీజేపీ వైసీపీ బంధాలు  మెరుగ్గా ఉన్నాయి. కానీ రేపు ఏమైనా తేడా వస్తే.. బీజేపీ ఇలాంటి అవకాశాల్ని ఉపయోగించుకుంటుంది. శాసనమండలిని రద్దు చేసేస్తుంది. ఇలాంటి ఆయుధాల్ని బీజేపీకి వైసీపీనే అందిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  వైసీపీ  అనవసరంగా ఆవేశపడిన చేసిన ఓ పని వల్ల...  తాము చేయాలనుకున్నప్పుడు మండలి రద్దు కాకపోగా.. తమకు మెజార్టీ ఉన్నప్పుడు...  రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది.  

 

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget