Somu Veerraju: పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలి... ఏపీ సర్కార్ ఎనిమి గవర్నమెంట్ ... సోము వీర్రాజు కామెంట్స్
పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగులతో మళ్లీ చర్చలు జరపి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. పీఆర్సీ జీవోలపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులను మళ్లీ చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం పనిచేయలేదని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో ఇంటి అద్దె పెరిగిపోయి, హెచ్ఆర్ఏ తగ్గించడంతో ఉద్యోగులకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా కాకుండా ఎనిమి గవర్నమెంట్ గా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఉద్యోగుల పక్షాన బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆత్మకూరులో జరిగిన ఘటనపై హోంమంత్రి విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: పీఆర్సీకి వ్యతిరేకంగా చలో కలెక్టరేట్... రోడెక్కిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
'మా కార్యకర్తను రిమాండ్ చేశారు. ప్రత్యర్థి నాయకులను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారిని అరెస్ట్ చేయలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం చేస్తే వెంటనే అరెస్టు చేస్తున్నారు. దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేస్తే పట్టించుకోవడంలేదు. బీజేపీ ఈ ఘటనలపై ప్రశ్నిస్తే మతతత్వ పార్టీ అని ముద్రవేస్తున్నారు. ప్రజా నిరసన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం.' అని సోము వీర్రాజు అన్నారు.
Also Read: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు
కాకినాడ కలెక్టరేట్ ముట్టడి
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో ఇచ్చిన పిలుపుతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి పలువురు ఉద్యోగులు, పెద్దఎత్తున ఉపాధ్యాయులు, పెన్షనర్లు హాజరయ్యారు. సచివాలయం ఉద్యోగులు, సీఐటీయూ, ఏఐటీయూసీ ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. ధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమని మండిపడ్డారు. పీఆర్సీ విషయంలో ఏపీ సర్కార్ చేస్తున్న అన్యాయంపై ఉద్యోగులంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలకు ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్ లో ఉద్యోగులందరూ సమ్మెకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఫ్యాప్టో నేతలు హెచ్చరించారు.
Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.