అన్వేషించండి

Mla Balakrishna: హిందూపురం జిల్లా సాధనకు రాజీనామాకైనా సిద్ధం : ఎమ్మెల్యే బాలకృష్ణ

పార్లమెంట్ కేంద్రాలను జిల్లా చేస్తానని పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హిందూపురాన్ని జిల్లా చేయాలని అందుకోసం రాజీనామాకు కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు.

హిందూపురం జిల్లా సాధన కోసం స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ మౌన దీక్ష చెప్పట్టారు. హిందూపురం జిల్లాగా ప్రకటించని పక్షంలో ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేయడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. పుట్టపర్తిని జిల్లాగా చేస్తే పుట్టపర్తిలో కూడా ధర్నా నిరసనలు చేపట్టి జిల్లాను సాధించుకుంటామన్నారు. ఎన్.టి.ఆర్ మీద అభిమానం ఉంటే అన్న కాంటీన్ ఎందుకు తొలగించినట్టు అని వైసీపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశ్నించారు. ఎంపీ పుట్టపర్తికి మద్దతు పలికారని, ఇప్పుడు ఆ ఎంపీ ఎక్కడని బాలకృష్ణ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ గతంలో 30 మంది కౌన్సిలర్లను ఇస్తే హిందూపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. హిందూపురాన్నే జిల్లాగా ప్రకటిస్తూ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ సూచించారు. జిల్లాగా హిందూపురానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. హిందూపురం జిల్లా సాధనకు టీడీపీ కౌన్సిలర్లు, తాను రాజీనామాకు సిద్ధమని వైసీపీ నేతలు రాజీనామాలకు సిద్ధమా అని బాలయ్య సవాల్ విసిరారు. 

బాలకృష్ణ మౌనదీక్ష

హిందూపురం జిల్లా కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష పోరాటంలోకి దిగారు.  హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి మౌనదీక్ష చేపట్టారు. గురువారమే హిందూపురం చేరుకున్న బాలకృష్ణ పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి అంబేడ్కర్‌ సెంటర్ వరకు పట్టణ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత  అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో మౌనదీక్షకు కూర్చున్నారు. సాయంత్రం వరకూ ఆయన మౌనదీక్ష  చేస్తారు. అనంతపురం జిల్లాను కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడదీస్తున్న ఏపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో హిందూపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి జిల్లా కావాలని ప్రజలు ఎవరూ అడగలేదని జిల్లా కేంద్రంగా హిందూపురం అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చాలా కాలంగా అభిప్రాయం ఉంది.

హిందూపురం జిల్లా సాధనకై పోరుబాట

ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు కూడా హిందూపురం జిల్లా కేంద్రం అవుతుందని స్థానికులు ఎదురుచూస్తున్నారు. ఆ క్షణం వచ్చే సరికి ప్రభుత్వం పుట్టపర్తి వైపు మొగ్గు చూపడం హిందూపురం వాసుల్ని నిరాశపరిచింది. జిల్లాల విభజనకు మొదటి నుంచి మద్దతుగా మాట్లాడుతున్న బాలకృష్ణ హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం మాట తప్పడంతో ప్రత్యక్షంగా ఉద్యమంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం మౌనదీక్ష పూర్తయిన తర్వాత ఆయన హిందూపురం నియోజకవర్గంలోని అన్ని పార్టీలు, స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలతో సమావేశం అవుతారు. అందరితో చర్చించి ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి హిందూపురం జిల్లాను సాధించాలని బాలకృష్ణ పట్టుదలగా ఉన్నారు. అందర్నీ కలుపుకని వెళ్లి పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
YS Jagan Delhi: జగన్ ఢిల్లీ రాజకీయం - మోదీ, అమిత్ షాలతో సమావేశానికి ప్రయత్నం - రాజకీయంగా మేలేనా !?
జగన్ ఢిల్లీ రాజకీయం - మోదీ, అమిత్ షాలతో సమావేశానికి ప్రయత్నం - రాజకీయంగా మేలేనా !?
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?

వీడియోలు

Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Embed widget