PV Chalapathirao : బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతి రావు కన్నుమూత
PV Chalapathirao : బీజేపీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు ఆదివారం కన్నుమూశారు.
PV Chalapathirao : బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ చలపతిరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు చలపతిరావు. ఆరిలోవ పినాకిల్ ఆసుపత్రిలో ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. పీవీ చలపతిరావు కుమారుడు పీవీ మాధవ్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యునిగా కొనసాగుతున్నారు. చలపతిరావు భౌతిక కాయాన్ని మరి కాసేపట్లో ఇసుకతోట పిఠాపురం కాలనీకి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షులు, పూర్వ ఎమ్మెల్సీ శ్రీ పి.వి. చలపతి రావు గారు స్వర్గస్తులయ్యారు.
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) January 1, 2023
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని బిజెపి ఆంధ్రప్రదేశ్ ఆ భగవంతుని ప్రార్థిస్తోంది. pic.twitter.com/Gzg64vMUYQ
సోము వీర్రాజు దిగ్భ్రాంతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు పీవీ చలపతిరావు ఆదివారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పీవీ చలపతిరావు మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అభివృద్ధి కోసం చలపతిరావు నిరంతరం కృషి చేశారన్నారు. చలపతిరావు తనకు మార్గదర్శకులని సోము వీర్రాజు తెలిపారు. కార్మిక సంఘం నాయకుడిగా, విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా చలపతిరావు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆనాటి జనసంఘ్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నేతల్లో చలపతిరావు ముఖ్యులని సోము వీర్రాజు గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీపై చలపతిరావు చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శం అన్నారు. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.