అన్వేషించండి
తిరుమల మెట్ల మార్గంలో ఏం చర్యలు తీసుకున్నారు? టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు
ఈ మధ్యకాలంలో తిరుమలకు వెళ్లే నడకదారిలో వన్యమృగాల సంచారం, రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారించింది.

తిరుమల మెట్ల మార్గంలో ఏం చర్యలు తీసుకున్నారు? టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు
తిరుమలలో మెట్ల మార్గం నుంచి వెళ్లే భక్తుల కోసం చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారించింది. అక్కడ భక్తుల రక్షణ కోసం ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. దీనిపై మూడు వారాల్లో సమాధానం చెప్పాలని టీటీడీ, అటవీశాఖకు నోటీసులు జారీ చేసింది.
భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించింది హైకోర్టు. చిరుత దాడిలో చనిపోయిన లక్షిత కుటుంబానికి పరిహారం పెంచాలని ఆదేశించింది. అయితే ఆ ఫ్యామిలీకి 15 లక్షలు ఇచ్చినట్టు ప్రభుత్వం కోర్టుకు వివరించింది.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
విజయవాడ





















