అన్వేషించండి

Andhra Pradesh: మరో గుడ్ న్యూస్ చెప్పనున్న ఏపీ ప్రభుత్వం, పింఛన్ల పెంపు ఎప్పుడంటే?

Pension Kanuka Increase: ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పింఛను జులై 1వ పెంచిన పింఛన్ల సొమ్ము అందించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. 

Chandra Babu: ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం (TDP Govt) అడుగులు వేస్తోంది. తాము అధికారంలోకి వస్తే రూ.4 వేల పింఛను (Pension Kanuka) పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు ఉమ్మడి మ్యానిఫెస్టో (TDP Janasena Manifesto)లో ప్రకటించాయి. అలాగే దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చాయి. ప్రజలు ఇచ్చిన అఖండ విజయంతో టీడీపీ కూటమి ప్రభుత్వం హామీల అమలుపై కసరత్తు చేస్తోంది. పింఛను జులై 1వ పెంచిన పింఛన్ల సొమ్ము అందించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. 

జులై ఒక్క నెలకే రూ.4,400 కోట్లు అవసరం
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వీరికి పెన్షన్ల పంపిణీకి నెలకు రూ.1,939 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేలు ఇవ్వాల్సి ఉంది. ఇందులో జులై 1న ఇచ్చే పింఛను రూ.4 వేలతో పాటు ఏప్రిల్‌ నుంచి జూన్ వరకు నెలకు రూ.వెయ్యి చొప్పున అదనంగా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దివ్యాంగులకు రూ.6 వేల పింఛను ఇవ్వనున్నారు. వీరందరికి కొత్త, పెంచిన పెన్షన్ మొత్తంతో కలిపితే జులై 1న పంపిణీ చేయడానికి రూ.4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి నెలకు రూ.2,800 కోట్లు వ్యయం అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.  

దివ్యాంగుల పెన్షన్ పెంపు
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పింఛనుదారులు దాదాపు 8 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరందరికి ప్రస్తుతం రూ.3 వేలు పింఛను వస్తోంది. దీనిని రూ.6 వేలకు పెంచుతామని కూటమి నేతలు, ఎన్నికల ప్రచారం, మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు, కిడ్నీ రోగులు, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 

వారికి 50 ఏళ్లకే పింఛన్ 
టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు 50 ఏళ్లకే పింఛన్ అమలు చేస్తామని ఆయా పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం ఆయా సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంత మంది ఉన్నారు? వారిలో ఇప్పటికే పింఛను పొందుతున్న వారు ఎంత మంది ఉన్నారనే వివరాలను సమీకరిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget