అన్వేషించండి

AP NTR Bharosa Pension: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీకి ఎస్‌ఈసీ గ్రీన్ సిగ్నల్

ఏపీలో ఈ నెల 30న 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల (NTR Bharosa Pension) పంపిణీకి ఎస్‌ఈసీ ఆమోదం తెలుపగా, సెర్ప్ సీఈవో కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎన్నికల కోడ్‌లోనూ పింఛన్ల పంపిణీకి ఈసీ ఆమోదం లభించింది.
  • అక్టోబర్ 30న పంపిణీ; మిగిలినవారికి నవంబర్ 4, 5న.
  • ఏపీ దేశంలో అత్యధిక పింఛన్లు అందిస్తున్న రాష్ట్రంగా నిలిచింది.
  • వృద్ధులకు రూ.4000, వికలాంగులకు రూ.6000 పింఛన్ అందిస్తున్నారు.

AP Pensions | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, లబ్ధిదారులకు 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల (NTR Bharosa Pensions) పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆమోదం తెలిపింది. ఎన్నికల కోడ్ మినహాయింపుతో పింఛన్ల అందజేతకు మార్గం సుగమం కావడంతో, ఈ నెల 30వ తేదీన అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు సెర్ప్ (SERP) సీఈవో కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఈ నెల 29నే బ్యాంకుల నుంచి అవసరమైన నిధులను డ్రా చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ నెల 30న ఏ కారణంతోనైనా పింఛన్ తీసుకోలేని వారికి మరొక అవకాశం కల్పిస్తూ, నవంబర్ 4, 5 తేదీల్లో మిగిలిన లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు AP ప్రభుత్వం వెల్లడించింది.

పింఛన్లకు అధికంగా ఖర్చు చేస్తున్న ఏపీ ప్రభుత్వం

దేశంలో అత్యధిక మొత్తం పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిసిందే. వృద్ధులతో పాటు స్పౌజ్ పింఛన్లు నెలవారీ రూ.4000 అందిస్తున్నారు. వికలాంగులకు రూ.6 వేలు ఇస్తుండగా.. పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పింఛన్‌, కిడ్నీ, తలసీమియా వంటి దీర్జకాలిక వ్యాధుల బారిన పడిన వారకి నెలకు రూ.10 వేలు పింఛన్ రూపంలో ఇస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తోంది.

ఏపీలో ప్రస్తుతం పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్లు వచ్చాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించారు. నవంబర్ 1న ఎన్నికలు నిర్వహించి, 3న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతల్ని ప్రకటిస్తారు. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సైతం నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించి అర్హుల జాబితా పార్టీల వారీగా ప్రకటించారు. నామినేషన్ల విత్ డ్రా చేసుకునే గడువు సైతం ముగియడంతో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఏపీ ఎస్ఈసీ విడుదల చేయనున్నారు.

Frequently Asked Questions

'ఎన్టీఆర్ భరోసా' పింఛన్లు ఎప్పుడు పంపిణీ చేయబడతాయి?

ఈ నెల 30న అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేయబడతాయి. ఒకవేళ ఆ రోజు తీసుకోలేని వారికి నవంబర్ 4, 5 తేదీల్లో మరొక అవకాశం కల్పించబడుతుంది.

ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీకి అనుమతి ఉందా?

అవును, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీకి ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల లబ్ధిదారులకు ఎంత పింఛను అందుతుంది?

వృద్ధులకు రూ.4000, వికలాంగులకు రూ.6000, పూర్తి వైకల్యంతో ఉన్నవారికి రూ.15000, దీర్ఘకాలిక వ్యాధుల వారికి రూ.10000 పింఛను అందిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Arnab Live Updates: రేపు ఉదయం యానాం వద్ద తీరం దాటనున్న అర్నబ్ తుపాను
రేపు ఉదయం యానాం వద్ద తీరం దాటనున్న అర్నబ్ తుపాను
AP Local Body Elections: సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. పట్టణ స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. పట్టణ స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
Cyclone Arnab Landfall: అతి వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. బుధవారం ఉదయానికి తీరం దాటే అవకాశం
అతి వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. బుధవారం ఉదయానికి తీరం దాటే అవకాశం
AP Local Body Elections: కూటమి స్పూర్తిని చాటేలా సీట్ల సర్దుబాటు, చంద్రబాబు అనుభవంతో కుదిరిన ఏకాభిప్రాయం: పవన్ కళ్యాణ్
కూటమి స్పూర్తిని చాటేలా సీట్ల సర్దుబాటు, చంద్రబాబు అనుభవంతో కుదిరిన ఏకాభిప్రాయం: పవన్ కళ్యాణ్
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Wrong e-Challan: ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘించకపోయినా చలానా వచ్చిందా? రాంగ్‌ ఈ-చలాన్‌ను రద్దు చేయించడం ఎలా?
పొరపాటున మీకు ట్రాఫిక్‌ చలాన్ వచ్చిందా? కంగారు వద్దు.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి!
Embed widget