అన్వేషించండి

Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం

పోలవరం ప్రాజెక్టు పనుల కోసం కేంద్రం నుండి సానుకూల స్పందన లభించింది. డ్యామ్ పనులతో పాటు, అత్యంత కీలకమైన పునరావాసం, పరిహారం ప్రక్రియ కోసం రాష్ట్ర జలవనరుల శాఖ పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Andhra Pradesh News | అమరావతి: ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు పనుల కోసం తాజాగా మరో ₹1,301 కోట్ల అడ్వాన్స్ నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే కేంద్రం ₹1,508 కోట్లు విడుదల చేయగా, తాజా నిధులతో కలిపి మొత్తం నిధుల వాటా ₹2,809 కోట్లకు చేరింది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో సవరించిన అంచనాల మేరకు కూటమి ప్రభుత్వం దాదాపుగా నిధులను పొందినట్లయింది.

గతంలో కేంద్రం అందించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది. గతంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు 1,508 కోట్లలో, రూ.600 కోట్లను ప్రాజెక్టు నిర్మాణ పనులకు, మరో రూ. 300 కోట్లను భూసేకరణ, పునరావాస పనుల కోసం వెచ్చించింది. కేంద్ర నిబంధనల ప్రకారం, ఇచ్చిన అడ్వాన్స్ నిధులలో 75% ఖర్చు చేస్తేనే తదుపరి విడత నిధులు విడుదలవుతాయి. అయితే, గతంలో ఖర్చు చేసిన రూ. 300 కోట్లను కేంద్రం కొన్ని సాంకేతిక కారణాల వల్ల రీయింబర్స్ చేయలేదు.

ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు పోలవరం ప్రాజెక్టును సందర్శించినప్పుడు, రాష్ట్ర అధికారులు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసినప్పటికీ నిధుల విడుదల పెండింగ్‌లో ఉన్న విషయాన్ని వివరించి, క్షేత్రస్థాయిలో జరిగిన పనులను ప్రత్యక్షంగా చూపించారు. అధికారుల వివరణతో సంతృప్తి చెందిన కేంద్రం, ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించి ఇప్పుడు అదనపు అడ్వాన్స్‌ను మంజూరు చేసింది.

పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులతో పాటు, అత్యంత కీలకమైన పునరావాసం, పరిహారం (R&R) ప్రక్రియ కోసం కేంద్రం నిధుల చేయడం పునరావాస ప్యాకేజీల పంపిణీలో భాగంగా నిర్వాసితులకు, రైతులకు ఎంతో కీలకం కానున్నాయి. కేంద్రం విడుదల చేసిన ఈ నిధులలో నిర్వాసిత రైతులు, గిరిజన కుటుంబాల పరిహారం కోసం ఖర్చు చేయనున్నారు. నిధులు ప్రాజెక్ట్ అకౌంట్‌లో జమ అయిన వెంటనే, అర్హులైన లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే స్పిల్‌వే వంటి కీలక పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధుల విడుదల పనులకు మరింత ఊతం ఇవ్వనుంది. నిధుల విడుదలతో ముంపు గ్రామాల ప్రజలు, రైతు కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
RS 20000 Subsidy For BCs: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War Latest Updates: ట్రంప్ హత్య కుట్ర జరిగిందన్న ఇజ్రాయెల్! రెచ్చిపోయిన అమెరికా! ఇరాన్‌పై దాడికి అసలు కారణం ఇదే! 
ట్రంప్ హత్య కుట్ర జరిగిందన్న ఇజ్రాయెల్! రెచ్చిపోయిన అమెరికా! ఇరాన్‌పై దాడికి అసలు కారణం ఇదే! 
Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
Dulquer Salmaan Pooja Hegde : దుల్కర్‌తో అందాల బుట్టబొమ్మ - క్యూట్ కపుల్ లవ్ స్టోరీకి క్రేజీ టైటిల్
దుల్కర్‌తో అందాల బుట్టబొమ్మ - క్యూట్ కపుల్ లవ్ స్టోరీకి క్రేజీ టైటిల్
Kylian Mbappe Record Goal : ఎంబాప్పే హిస్టారికల్ వరల్డ్ రికార్డ్.. మొరాకోను చిత్తు చేసి సెమీస్ లోకి ఫ్రాన్స్, మెస్సితో గోల్డెన్ బూట్ మైండ్ బ్లోయింగ్ ఫైట్!
ఎంబాప్పే హిస్టారికల్ వరల్డ్ రికార్డ్.. మొరాకోను చిత్తు చేసి సెమీస్ లోకి ఫ్రాన్స్, మెస్సితో గోల్డెన్ బూట్ మైండ్ బ్లోయింగ్ ఫైట్!
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
Embed widget