అన్వేషించండి

Organically Made Clothes:పురుగుమందుల్లేని వస్త్రాల గురించి మీకు తెలుసా? అవెలా తయారవుతాయి?

టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అంటున్నారు. ఇదే కోవలో ఆరోగ్య జాగ్రత్తల విషయానికొస్తే కరోనాకి ముందు కరోనా తర్వాత అని చెబుతున్నారు. ఇందులో భాగమే ఆర్గానిక్ వస్త్రాల ట్రెండ్.

పురుగుమందుల్లేని వస్త్రాల గురించి మీకు తెలుసా? అవెలా తయారవుతాయి?

Organically Made Clothes:పురుగుమందుల్లేని వస్త్రాల గురించి మీకు తెలుసా? అవెలా తయారవుతాయి?

ఆర్గానిక్...ఆర్గానిక్...ఆర్గానిక్...ఎక్కడ చూసినా ఆర్గానిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎప్పుడో ప్రారంభమైన ఈ ట్రెండ్ కరోనా భయంతో మరింత ఊపందుకుంది. అయితే ఇప్పటి వరకూ ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ వస్తువుల గురించే తెలుసేమో.....త్వరలో మార్కెట్లో ఆర్గానిక్ వస్త్రాలు కూడా సందడిచేయబోతున్నాయి. ఆహారం, వస్తువులు సంగతి సరే మరి ఆర్గానికి వస్త్రాలెలా సాధ్యం... అయినా ఇప్పటి వరకూ పురుగు మందుల్లేని వస్త్రాలు అనే మాటే వినలేదే అంటారా....అందుకే....అవెలా తయారవుతాయో మీకు వివరిస్తోంది ఏబీపీ దేశం....

Organically Made Clothes:పురుగుమందుల్లేని వస్త్రాల గురించి మీకు తెలుసా? అవెలా తయారవుతాయి?

ఆర్గానిక్ వస్త్రాలు ఎలా నేస్తారంటే...!
ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా సాగు చేసిన పత్తిని సేకరించి.. దానినుంచి నూలు ఒడుకుతున్నారు. ఆ నూలుకు సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులను అద్ది ఆర్గానిక్‌ వస్త్రాలు నేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా పెడన, గుంటూరు జిల్లా ఇసుకపల్లి, తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేలో నేతకార్మికులు ఈ తరహా వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఇందుకోసం అన్నీ సహజసిద్ధమైన రంగులే వినియోగిస్తున్నారు. 

Organically Made Clothes:పురుగుమందుల్లేని వస్త్రాల గురించి మీకు తెలుసా? అవెలా తయారవుతాయి?

రంగులెలా అద్దుతారంటే....
చెట్ల బెరడు, పూలు, పండ్లు, కాయలు, ఆకులు సేకరించి....వాటిని నీటిలో ఉడికించి సహజసిద్ధ రంగుల్ని తయారు చేస్తున్నారు.  ఆ రంగుల్లో ముంచి ఆరబెట్టిన ఆర్గానిక్‌ నూలుతో మగ్గంపై కలర్‌ ఫుల్‌ వస్త్రాలు నేస్తున్నారు.  
దానిమ్మ బెరడుతో పసుపు, ముదురు ఆకుపచ్చ రంగులు.... 
కరక్కాయ, జాజి, అల్జీరిన్‌తో ఎరుపు...... 
కరక్కాయ, కరక పువ్వుతో బంగారు పసుపు రంగు.... 
మోదుగ పూలతో ముదురు పసుపు రంగు
చామంతి పూలతో లేత పసుపు రంగు.....
ఇండిగో ఆకుల నుంచి నీలం, ఉల్లి పైపొరతో లేత గులాబీ
పాలకూర ఆకుల నుంచి లేత ఆకుపచ్చ.... 
నల్ల బెల్లం, నీరు, కాల్చిన ఇనుము కలిపిన మిశ్రమం నుంచి నలుపు రంగుల్ని తయారు చేస్తున్నారు.
వీటిని తుమ్మ జిగురుతో కలిపి బట్టలకు రంగులు బాగా పట్టేలా చేస్తున్నారు. ఈ వస్త్రాల తయారీకి ఖర్చు ఎక్కువే అయినా.. క్రేజ్‌ మాత్రం ఓ రేంజ్ లో ఉంది.

Organically Made Clothes:పురుగుమందుల్లేని వస్త్రాల గురించి మీకు తెలుసా? అవెలా తయారవుతాయి?

ఆర్గానిక్ వస్త్రాలతో లాభమేంటి?

నిక్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యం అని చెబుతారు...మరి ఆర్గానిక్ వస్త్రాలతో ఏలాభం అంటారా?.... ఆర్గానిక్ వస్త్రాల వినియోగంతో ఆరోగ్యానికి , పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. రసాయనాలు వినియోగించి తయారు చేసిన వస్త్రాల వల్ల చర్మ సంబంధ వ్యాధులు, ఆ రసాయనాలు పీల్చడం వల్ల ఊపిరి తిత్తులు సమస్యలు వస్తాయంటారు. కానీ ఆర్గానిక్ వస్త్రాలతో అలాంటి సమస్యలే ఉండవు. 

Organically Made Clothes:పురుగుమందుల్లేని వస్త్రాల గురించి మీకు తెలుసా? అవెలా తయారవుతాయి?

అంతర్జాతీయ మార్కెట్ కల్పించే దిశగా అడుగులు

ట్రెండ్ కి తగ్గట్టుగా రూపుదిద్దుకుంటున్న ఆర్గానిక్‌ చేనేత వస్త్రాలకు  అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్‌ సహా పలు దేశాలకు ఏపీ ఆర్గానిక్ చేనేత వస్త్రాలు ఎగుమతి చేయడం ద్వారా మార్కెట్ పరిధి పెరగడంతో పాటూ నేతన్నలకు ఉపాధి లభిస్తుందనే యోచనలో ఉన్నారు. అందుకే ఆ దిశగా అడుగులేస్తున్నారు....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget