జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం - మొదటి రోజు 1306 సచివాలయల పరిధిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నేతలు, అధికారులు, సచివాలయ సిబ్బంది శిబిరాల్లో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు.
జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభమైంది. సచివాలయాల పరిధిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నేతలు, అధికారులు, సచివాలయ సిబ్బంది శిబిరాల్లో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు సర్టిఫికేట్లు అందజేస్తున్నారు. తొలి రోజుల 1306 సచివాలయాల్లో క్యాంపులు నిర్వహిస్తున్నారు.
జగనన్న సురక్ష బలహీనవర్గాలకు రక్ష#JaganannaSurakshaCamp#YSRCPAgain2024 pic.twitter.com/xEuSaJicfO
— 🇱🇸𝐒𝐢𝐥𝐞𝐧𝐭 𝐃𝐞𝐯𝐚𝐫𝐚 (@SrinathReddyO) July 1, 2023
ఈ సచివాలయాల పరిధిలో శిబిరాలు నిర్వహించే అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు పథకాలు ఇవ్వడంతోపాటు 11 సర్టిఫికెట్లు కూడా ఇవ్వబోతున్నారు. వీటి కోసం ఎలాంటి ఫీజుల వసూలు చేయకుండా ఇస్తున్నారు. నెల రోజుల పాటు జగనన్నసురక్ష కార్యక్రమం జరగనుంది.
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారం #JaganannaSurakshaCamp pic.twitter.com/j7vaTwf6sv
— Jagane Kavali (@JaganeKavali) July 1, 2023
క్యాంపుల్లో అందించే సర్టిఫికేట్స్ ఇవే
ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు)
ఆదాయ ధ్రువీకరణ పత్రం
డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
మరణ ధ్రువీకరణ పత్రం
మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ , మ్యుటేషన్ ఫర్ కరక్షన్స్
వివాహ ధ్రువీకరణ పత్రం
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు
ఆధార్‌కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేట్
కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ)
కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన
ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు.
ప్రతి మండలంలో రెండు వేర్వేరు టీంలను ఏర్పాటు చేశారు.. ప్రతి టీంలో ముగ్గురు అధికారులు ఉంటారు. 24 గ్రామాల కంటే ఎక్కువ ఉంటే మూడు టీంలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కువ వార్డు సచివాలయాలు ఉండే నగరాలు, సిటీలకు దగ్గరగా ఉండే సచివాలయం క్లస్టర్‌గా చెప్తారు. దీని పరిధిలో ఐదు వార్డు సచివాలయాలు ఉంటాయి. క్యాంపుల పర్యవేక్షణకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులు ఉంటారు. వారిని జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. గ్రామ సచివాలయాల భవనాల్లో లేదా... సమీప ప్రభుత్వ బిల్డింగ్‌లోనే క్యాంపులు నిర్వహిస్తున్నారు.
తిరుపతి జిల్లా గూడూరు నియోజక వర్గం#JaganannaSuraksha #JaganannaSurakshaCamp pic.twitter.com/cRxYUaXmKG
— Jagananna Connects (@JaganannaCNCTS) July 1, 2023
ఏ రోజు ఏ సచివాలయం పరిధిలో క్యాంపు నిర్వహిస్తున్నారో ముందస్తుగా అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి అనుగుణంగానే సిబ్బంది, వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. సచివాలయాల వద్ద నిర్వహించే క్యాంపుల్లో 11 సర్వీసులకు ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం పేర్కొంది. మ్యుటేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్ పుస్తకాల జారీకి స్టాట్యుటరీ చార్జీలు వసూలు చేస్తారు.
నేటి నుంచి 'జగనన్న సురక్ష'
— M.INDRASENAREDDY (@indrasena9966) July 1, 2023
▫️సచివాలయాలవారీగా క్యాంపుల నిర్వహణ
▫️తొలిరోజు 1,306 సచివాలయాల పరిధిలో
▫️14,29,051 కుటుంబాలకు వారం ముందే సమాచారం#JaganannaSurakshaCamp#JaganannaSuraksha pic.twitter.com/SiEf97dD6v