Andhra Pradesh రాజధాని అమరావతి నిర్మాణానికి హైదరాబాద్ నివాసి భారీ విరాళం
AP capital Amaravati Donations | రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ విరాళం వచ్చింది. హైదరాబాద్ నివాసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రూ. కోటి చెక్కు ఇవ్వడం విశేషం.
అమరావతి: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. కోటి విరాళంగా అందించారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం నాడు కలిసి ఈ మేరకు చెక్కును ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్నగర్లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో రూ.1 కోటి ఇచ్చామన్నారు. తమ తల్లి ఇందిరాదేవికి ఆత్మశాంతి కలిగేలా ఆవిడ కోరిక నెరవేర్చేందుకు హైదరాబాద్లో తమకున్న కొద్ది స్థలాన్ని అమ్మి విరాళం ఇస్తున్నట్టు పి విజయలక్ష్మి చెప్పారు. పి విజయలక్ష్మి త్యాగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు.