News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Rapes in AP: ఏపీలో ఘటనలపై మంత్రి తానేటి వనిత సంచలనం, జగన్ అందుకే జైలుకెళ్లారా? అంటూ అనిత కౌంటర్ ఎటాక్!

Taneti Vanitha on Gang Rape Incidents: విశాఖపట్నంలోని దిశ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన తానేటి వనిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు.

FOLLOW US: 
Share:

Home Minister Taneti Vanitha on Gang Rape Incidents: ఏపీలో వరుసగా జరుగుతున్న అత్యాచార నేరాల నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విశాఖపట్నంలోని దిశ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన తానేటి వనిత ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లల సంరక్షణ బాధ్యత పూర్తిగా తల్లిదేనని, ఆ పాత్ర సరిగా లేనప్పుడే ఇలాంటి అత్యాచారాల లాంటివి జరుగుతాయని ఆమె మాట్లాడారు. తండ్రి తన ఉద్యోగ వ్యాపారాల పని మీద బయటకు వెళ్లినప్పుడు సాధారణంగా బిడ్డల పెంపకం బాధ్యతను తల్లి చూసుకుంటుందని, ఆమె కూడా ఏ ఉద్యోగం కోసమో లేక కూలీ పనుల కోసమో బయటకు వెళ్తే పిల్లలను ఇంట్లో చూసుకోవడానికి ఎవరూ ఉండడం లేదని అన్నారు. దీనిని అలుసుగా తీసుకుని ఇరుగు పొరుగువారు, బంధువులు, కొన్నిచోట్ల తండ్రులే పిల్లలపై ఘోరాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

విజయమ్మ అలా పెంచడమే తప్పా?
అయితే, తానేటి వనిత చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ‘‘మహిళలపై అఘాయిత్యాలు ఆపడం చేతకాక అండగా నిలబడిన వారికి నోటీసులు, హత్యాచారంకు గురైన మహిళకు అక్రమసంబంధం అంటగట్టారు. ఇప్పుడేమో ఏకంగా తల్లులను తప్పు పడుతున్నారు. రేపు తల్లులే చేయిస్తున్నారు అంటారా? అంటే విజయమ్మ బాగా పెంచి ఉంటే జగన్ రెడ్డి 16 నెలలు జైల్లో వుండేవాడు కాదని మీ అభిప్రాయమా?’’ అని వంగలపూడి అనిత ట్వీట్ చేశారు.

నిందితులకు శిక్ష పడేదాకా వదలం - మంత్రి విడదల రజిని
రేపల్లె రైల్వే స్టేషన్‌లో గ్యాంగ్ రేప్ ఘటన బాధాకరమని మంత్రి విడదల రజిని అన్నారు. అత్యాచార ఘటనపై సీఎం సీరియస్ అయ్యారని అన్నారు. నిందితులను కఠిన శిక్ష పడే వరకు వదిలిపెట్టబోమని చెప్పారు. ఇప్పటికే ముగ్గురిని పట్టుకున్నామని, ఘటనపై జిల్లా ఎస్పీ, ఆస్పత్రి అధికారులతో మాట్లాడామన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ఆదేశించినట్లు చెప్పారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు మంత్రి విడదల రజిని వివరించారు. బాధిత మహిళకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రజిని చెప్పారు.

Published at : 01 May 2022 01:43 PM (IST) Tags: AP HOME MINISTER Vangalapudi Anitha Taneti Vanitha Taneti vanitha comments in rape AP rape incidents repalle rape incident

ఇవి కూడా చూడండి

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Sajjala on Chandrababu: టీడీపీ నేతలకు పైత్యం బాగా పెరిగింది, అన్ని తప్పుడు వార్తలే - చంద్రబాబు

Sajjala on Chandrababu: టీడీపీ నేతలకు పైత్యం బాగా పెరిగింది, అన్ని తప్పుడు వార్తలే - చంద్రబాబు

Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

SI Recruitment: ఎస్ఐ పోస్టుల భర్తీలో కీలక పరిణామం - కోర్టులోనే 'ఎత్తు' కొలవండి, హైకోర్టు ఆదేశం

SI Recruitment: ఎస్ఐ పోస్టుల భర్తీలో కీలక పరిణామం - కోర్టులోనే 'ఎత్తు' కొలవండి, హైకోర్టు ఆదేశం

టాప్ స్టోరీస్

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!