Jinnah Tower: గుంటూరు జిన్నా టవర్‌కు జాతీయ పతాకం రంగులు.. నేతల మధ్య సద్దుమణిగిన వివాదం
Jinnah Tower painted in Tricolour: దేశ విభజనకు కారకుడైన పాకిస్తాన్ నేత జిన్నా పేరుతో నిర్మించిన సెంటర్ పేరు మార్చాలని బీజేపీ నేతలు ఇటీవల ఆందోళనకు దిగారు. టవర్‌కు జెండా రంగులు వేయడంతో వివాదం ముగిసింది.
![Jinnah Tower: గుంటూరు జిన్నా టవర్‌కు జాతీయ పతాకం రంగులు.. నేతల మధ్య సద్దుమణిగిన వివాదం Guntur Jinnah Tower: Days after controversy over name, Jinnah Tower painted in Tricolour Jinnah Tower: గుంటూరు జిన్నా టవర్‌కు జాతీయ పతాకం రంగులు.. నేతల మధ్య సద్దుమణిగిన వివాదం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/89a3159824bd41f1751792a097989d81_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guntur Jinnah Tower Latest News: గత నెల రోజులుగా రాష్ట్ర వ్వాప్తంగా జిన్నా టవర్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జిన్నా టవర్ వివాదానికి పరిష్కారం దొరికింది. త్రివర్ణ పతాకం రంగులు జిన్నా టవర్ కు వేసేందుకు తీర్మానం చేశారు. వెంటనే రంగులు వేసెందుకు చకచక ఏర్పాట్లు చేశారు. జిన్నా టవర్‌కు త్రివర్ణ పతాకం రంగులు వేసి వివాదానికి ముగింపు పలికారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం జిన్నా టవర్ పేరు మార్చాలని , లేకపోతే టవర్ ఉండకూడదని వ్యాఖ్యానించడం తెలిసిందే.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువ. జిన్నా టవర్ కూడా ఈ నియోజకవర్గం కిందకే వస్తుంది. అయితే హిందువులు కూడా ఎక్కువే ఉంటారు. మత సామరస్యానికి గుంటూరులో ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. హిందూ, ముస్లింలు కలసి మెలిసి ఉంటారు. నగరంలో ముస్లిం ప్రముఖుల పేర్లతో వీధులు, రోడ్లు చాలా ఉంటాయి. అయితే కార్గిల్ యుద్ధం వంటి కొన్ని సందర్భాల్లో కొందరు భావోద్వేగాలతో జిన్నా టవర్ విషయంలో కొందరు అభ్యంతరాలు పెట్టారు. అవి రాను రాను పెరుగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ నేతలు కూల్చివేతలకు డిమాండ్ చేస్తున్నారు.
కొన్ని రోజుల కిందట జిన్నా టవర్‌పై వివాదం మొదలైంది. దేశ విభజనకు కారకుడైన పాకిస్తాన్ నేత జిన్నా పేరుతో నిర్మించిన ఈ సెంటర్ పేరు మార్చాలని, లేకపోతే జిన్నా టవర్ను తొలగించాలని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. రిపబ్లిక్ డే రోజున జిన్నా టవర్ పై జాతీరజండాను ఎగరు వేస్తామని హడావుడి చేయడం రాజకీయంగా దుమారం రేపింది. బీజేపి నేతలు చేస్తున్న ప్రయత్నాలకు అధికార వైఎస్సార్ సీపీ చెక్ పెట్టింది. జిన్నా టవర్ వద్ద జాతీయ జండాను ఇక్కడ ఎగురవేయడమే కాదు. త్రివర్ణ పతాకం రంగులు జిన్నా టవర్‌కు వేస్తామని చెప్పింది.
గుంటూరు జిన్నా టవర్ ను ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ మనోహర్ ఇటీవల పరిశీలించారు. జాతీయ జెండా ఎగురవేసే సమయంలో అన్ని పార్టీలకు అహ్వానం పలకుతామన్న ఎమ్మెల్యే తెలిపారు. కులం, మతం ప్రాంతం చూడకుండా అభివృద్ధే ప్రభుత్వ విధానంగా కృషి చేస్తామన్నారు. మతాల వివాదానికి వెళుతున్న సమయంలో జిన్నా టవర్ సమస్యకు పరిష్కారం లభించడం శుభపరిణామం అని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్రం సమాధానం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)