News
News
X

ఇంటి నుంచే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు- ఏపీలో అందుబాటులోకి సరికొత్త సేవ!

సవరించిన చట్టం ప్రకారం కొనుగోలుదారులు వస్తువులు ఎక్కడ కొన్నప్పటికీ తాను నివాసం ఉంటున్న ప్రాంతం నుంచే ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. అంతేకాదు వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేసు విచారణకు హాజరయ్యే వెసులుబాటు..

FOLLOW US: 

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఏపీ పౌర సరఫరాలు, వినియోగాదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. వినియోగదారులకు సత్వర న్యాయం జరిగే విధంగా వినియోగదారుల రక్షణ చట్టాన్ని సవరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి తొలి సమావేశం అమరావతి సచివాలయంలో జరిగింది. 

సవరించిన చట్టం ప్రకారం కొనుగోలుదారులు వస్తువులు ఎక్కడ కొన్నప్పటికీ తాను నివాసం ఉంటున్న ప్రాంతం నుంచే ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. అంతేకాదు వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేసు విచారణకు హాజరయ్యే వెసులుబాటును కల్పించడం జరిగిందన్నారు కారుమూరి నాగేశ్వరరావు. స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడమే కాకుండా అక్కడ నుంచే వీడియో కాన్పరెన్సు ద్వారా విచారణకు హాజరు కావచ్చన్నారు. గతంలో ఈ వెసులుబాటు లేదని, వినియోగదారుడు వస్తువు కొనుగోలు చేసిన ప్రాంతంలో లేదా ఆ వస్తువు తయారీదారుని రిజిస్టర్డు కార్యాలయంలో మాత్రమే ఫిర్యాదు చేసుకొనే వెసులుబాటు ఉండేదన్నారు. 

ప్రస్తుతం వినియోగదారులు తమ ఫిర్యాదులను స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లోగాని, ఆన్ లైన్ ద్వారా గాని లేదా వినియోగదారుల సహాయ సేవ కేంద్రం హెల్స్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లకు (1967 & 18004250082)గాని ఫిర్యాదు చేయవచ్చన్నారు మంత్రి నాగేశ్వరరావు. ఈ అవకాశాన్ని వినియోగదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. సవరించిన వినియోగదారుల రక్షణ చట్టంపై వినియోగదారుల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార మాద్యమాల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  

డిశంబరు 24న వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సవరించిన చట్టం ద్వారా వినియోగదారులకు కల్పించిన హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు మంత్రి కారుమూరి. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు పూర్తి స్థాయిలో తనిఖీలను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. గత పదిమాసాల కాలంలో మొత్తం 1,748 కేసులు నమోదయ్యాయని వివరించారు. పాత వాటితో కలుపుకుని ఇప్పటి వరకూ 2,139 కేసులు పరిష్కరించినట్టు పేర్కొన్నారు. ఇంకా 4,407 కేసులను పరిష్కరించవలసి ఉందని మంత్రి తెలిపారు. 

News Reels

తూనికలు, కొలతల శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్నారని, పెట్రోల్ బంకులల్లో తనిఖీలు జరిపి 97 కేసులు నమోదు చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఎరువుల దుఖానాలకు సంబంధించి 350 కేసులను, విశాఖపట్నం, విజయవాడలోని షాషింగ్ మాల్స్‌కు సంబంధించి 175 కేసులను నమోదు చేశారన్నారు. త్వరలో బంగారు నగల దుఖానాల్లో కూడా తనిఖీలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ధాన్యం తూకాల్లో రైతులకు ఎటు వంటి అన్యాయం జరుగకుండా ఉండేందుకై కోట్ల రూపాయలు వెచ్చిస్తూ దాదాపు 93 వే బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

ఆహార పదార్థాల కల్తీలను నివారించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలను తీసుకుందని పేర్కొన్నారు మంత్రి కారుమూరి. 15 మొబైల్ ల్యాబ్స్, విశాఖపట్నంలో ఉన్న ల్యాబ్‌ను ఆధునీకరించడంతోపాటు విజయవాడ, తిరుపతిలో శాశ్వత ప్రాతిపదిక ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలను తీసుకున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరికల్లా కనీసం ఆరు మొబైల్ ల్యాబ్స్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలను తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. 

రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వమే పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నందని, ఇందులో రైస్ మిల్లర్ల ప్రమేయం ఏమాత్రం లేదని, ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యాన్ని అమ్ముతున్నట్లు చాలా మంది అపోహపడుతున్నారన్నారు. అందులో ఏ మాత్రం నిజంలేదన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని  రైస్ మిల్లర్లకు డబ్బులు ఇచ్చి ప్రభుత్వం బియ్యం పట్టిస్తుతందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది వర్షాల వల్ల ధాన్యం పెద్దగా తడవలేదని, ఒక వేళ అక్కడక్కడా కొంత ధాన్యం తడిసినప్పటికీ ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు సొమ్ము చెల్లించాల్సి ఉందని, అయినప్పటికీ ఇంకా ముందుగానే రైతుల ఖాతాల్లో సొమ్మును జమచేస్తున్నామన్నారు మంత్రి. 

Published at : 25 Nov 2022 06:51 AM (IST) Tags: Minister Karumuri Nageswara Rao ap consumer forum consumer Rights

సంబంధిత కథనాలు

Pawan Kalyan: మీలో తెగింపు వాళ్లకీ ఉండుంటే రాజధాని కదిలేది కాదు - పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: మీలో తెగింపు వాళ్లకీ ఉండుంటే రాజధాని కదిలేది కాదు - పవన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

AP New CS : ఏపీ నూతన సీఎస్ గా మరోపేరు తెరపైకి, ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం!

AP New CS : ఏపీ నూతన సీఎస్ గా మరోపేరు తెరపైకి, ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం!

AP TDP: బీసీ మంత్రులను డమ్మీలను చేసి, వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనాలా?: టీడీపీ నేతలు ఫైర్

AP TDP: బీసీ మంత్రులను డమ్మీలను చేసి, వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనాలా?: టీడీపీ నేతలు ఫైర్

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

టాప్ స్టోరీస్

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Kishan Reddy : హైదరాబాద్ ఆదాయంలో 10 శాతం స్థానికంగా ఖర్చు చేయాలి - కిషన్ రెడ్డి

Kishan Reddy : హైదరాబాద్ ఆదాయంలో 10 శాతం స్థానికంగా ఖర్చు చేయాలి - కిషన్ రెడ్డి

Varaha Roopam Song Issue: ఓటీటీలో ఆ పాట వచ్చేసింది - ‘కాంతార‘ ఫ్యాన్స్, ఇక ఎంజాయ్ చేయండి!

Varaha Roopam Song Issue: ఓటీటీలో ఆ పాట వచ్చేసింది - ‘కాంతార‘ ఫ్యాన్స్, ఇక ఎంజాయ్ చేయండి!