అన్వేషించండి

Atchannaidu: మోకాలికి బోడిగుండుకి ముడి వేసేందుకు జగన్ మాఫియా ప్రయత్నం - అచ్చెన్న

రాజకీయ కక్షతో సీఐడీ టీడీపీ అధినేతపై అక్రమ కేసులు పెడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

స్కిల్ డెవలప్మెంట్‌కి సంబంధించి రూ.27 కోట్ల నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాకు మళ్లించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాజకీయ పార్టీకి రూ.20 వేలకు మించి నగదు రూపంలో విరాళం ఇచ్చినట్లైతే అలాంటి వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు సదరు పార్టీ వారు తెలియజేస్తారని చెప్పారు. అవి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయని.. ఏప్రిల్ 2023లో ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుండి తెలుగుదేశం పార్టీ నిధుల వివరాలను సీఐడీ అధికారికంగా డౌన్ లోడ్ చేశారని చెప్పారు. అందులోనే ఎవరు ఏ రోజు ఎంత మొత్తంలో విరాళాలిచ్చారో స్పష్టంగా ఉందని చెప్పారు. 

‘‘వాటిపై ఆరు నెలల పరిశోధన చేసిన సీఐడీ, ఎలాంటి అవకతవకలు లేకున్నా బురద జల్లడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని చెప్పడం, దానిని అక్రమ కేసులకు ముడిపెట్టడం దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నాయని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం. 2018-19లో టీడీపీ ఖాతాకు రూ.27 కోట్లు ఎలక్షన్ బాండ్ల రూపంలో వచ్చాయంటున్నారు. అదే సంవత్సరంలో అవే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వైసీపీ ఖాతాకు రూ.99.84 కోట్లు, 2019-20లో రూ.74.35 కోట్లు, 2020-21లో రూ.96.25 కోట్లు, 2021-22లో రూ.60 కోట్లు వచ్చాయి. ఈ విరాళాలిచ్చిన వ్యక్తులు, సంస్థల పేర్లు సాక్షి పేపర్లో ప్రచురించే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?’’

ఆరు నెలల క్రితం ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుండి సేకరించినట్లు నీ పంచనామా నివేదిక చెబుతోంది. ఆరు నెలల పరిశోధన తర్వాత ఎలాంటి ఆధారాలు దొరక్క ఇప్పుడు కోర్టు ముందు పెద్ద మొత్తంలో నగదు వచ్చిందని అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. ఆరు నెలల్లో ఏం ఆధారాలు కనిపెట్టారో కోర్టుకు ఎందుకు సమర్పించలేకపోతున్నారు? చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేసేందుకు, ఆయన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేందుకు దర్యాప్తు సంస్థలు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న కుట్ర మాత్రమే. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ సేకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ చట్టం కూడా చేసింది.

కానీ జగన్ రెడ్డి వాటిని కూడా తప్పుబడుతూ, అదో కుంభకోణం అన్నట్లుగా మాట్లాడుతూ కేంద్ర చట్టాలను అపహాస్యం చేస్తున్నాడు. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి ఉంచడానికి కుట్ర చేస్తున్నారని ఈ వ్యాఖ్యలతోనే అర్ధమవుతోంది. న్యాయ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ద్వారా ప్రజాహక్కుల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారు’’ అని కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Forbes 30 Under 30 Asia 2026:ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
PM Kisan: రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Embed widget