అన్వేషించండి

AP Rains Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయని, ఉత్తరాంధ్ర తీరంలో 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APDMA) హెచ్చరించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, బలమైన గాలులు.
  • ఉత్తరాంధ్ర, పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు.
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అధికారుల సూచనలు పాటించాలి.

Andhra Pradesh Heavy Rains | అమరావతి: విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న మరొక అల్పపీడనం వల్ల కూడా రాష్ట్రంలో వర్షాలు విస్తరించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 40 నుండి 60 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

నేడు ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఆదివారం (13-09-2026) ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వర్ష సూచనను వాతావరణశాఖ అధికారులు విడుదల చేశారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.


AP Rains Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉన్నందున విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించింది. ప్రజలు వర్షాల సమయంలో చెట్లు, యాడ్ హోర్డింగ్‌ల కింద నిలబడవద్దని.. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. సమద్ర తీరం వెంబడి 50 నుండి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు నేడు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు.


AP Rains Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

ప్రభుత్వ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దు: మంత్రి వంగలపూడి అనిత

రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో నేడు పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.  వాతావరణ హెచ్చరికలతో ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ (RTGS) అవేర్ జారీ చేసే అధికారిక సూచనలను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దని, అలాగే సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు.

కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు

వర్షాల సమయంలో ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా అధికారులు వేగంగా చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఉధృతంగా పొంగిపొర్లే వాగులు, వంకలు, కాలువలను దాటే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దని హెచ్చరించారు. ప్రమాదకర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను తక్షణమే నిలిపివేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు నిరంతరం సమన్వయంతో వ్యవహరిస్తూ, ప్రమాదకర తీర ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. వర్షాల వల్ల రాష్ట్రంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు కారణం ఏమిటి?

విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న మరో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది?

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

వర్షాల సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రజలు చెట్లు, హోర్డింగ్‌ల కింద నిలబడవద్దు, పొంగిపొర్లే వాగులు దాటవద్దు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. ప్రభుత్వ హెచ్చరికలను పాటించాలి.

పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు ఏవి?

విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
CM Chandrababu:సెమీకండక్టర్‌ రంగంలో ఏపీకి కేంద్రం భరోసా, రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌
సెమీకండక్టర్‌ రంగంలో ఏపీకి కేంద్రం భరోసా, రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌
Jagan Letter To Sharmila: షర్మిల తీరు బాధించింది, నా కూతుళ్ల విషయంలోనూ అదేమాట: సోదరికి జగన్ లేఖ
షర్మిల తీరు బాధించింది, నా కూతుళ్ల విషయంలోనూ అదేమాట: సోదరికి జగన్ లేఖ
CM Chandrababu: పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget