అన్వేషించండి

AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లోని 28 జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 19న ప్రచురించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ఖరారు.
  • రాష్ట్ర ఎన్నికల సంఘం 28 జిల్లాల్లో తుది జాబితాను సెప్టెంబర్ 19న ప్రచురించింది.
  • అభ్యంతరాల పరిశీలన అనంతరం కలెక్టర్ల ఆమోదంతో ఈ జాబితా విడుదలైంది.
  • ఓటర్ల జాబితాల ప్రక్రియ కూడా పూర్తవగా, నోటిఫికేషన్ త్వరలో వస్తుంది.

AP Local Body Elections | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను శనివారం (సెప్టెంబర్ 19న) ప్రచురించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (AP SEC) అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. 

ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 09న సర్య్కులర్ జారీ చేసి పోలింగ్ కేంద్రాల ప్రక్రియను ప్రారంభించారు. ఆ షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రజా వినతులు, అభ్యంతరాల స్వీకరణ నిర్వహించారు. అనంతరం సెప్టెంబర్ 16న మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (MPDO) ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించిన అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు ఈ పోలింగ్ స్టేషన్ల తుది జాబితాకు ఆమోదం తెలిపారు. కలెక్టర్ల ఆమోదముద్ర వేయడంతో శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల తుది నివేదికను అందుబాటులో ఉంచారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక పోరుకు సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకున్నట్లయింది.

ఎన్నికల కసరత్తు ఇతర వివరాలు
పోలింగ్ కేంద్రాల ఖరారుతో పాటుగా ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఓటర్ల జాబితాలను కూడా ఎన్నికల సంఘం ప్రదర్శించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కేంద్రాల ఖరారు కంటే ముందే.. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) లో కూడా పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ఎస్‌ఈసీ ఇటీవల పూర్తి చేసింది. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తయినందున, త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

Frequently Asked Questions

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తాజా కీలక ముందడుగు ఏమిటి?

రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం 28 జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల తుది జాబితాను సెప్టెంబర్ 19న ప్రచురించింది. ఇది ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించడంలో భాగంగా చేపట్టిన చర్య.

పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఎలా ఖరారు చేశారు?

సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ప్రజా వినతులు, అభ్యంతరాల స్వీకరణ తర్వాత, వాటిని పరిశీలించి, జిల్లాల కలెక్టర్లు ఆమోదించాక జాబితాను ఖరారు చేశారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తదుపరి దశ ఏమిటి?

ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తైనందున, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Letter To Sharmila: షర్మిల తీరు బాధించింది, నా కూతుళ్ల విషయంలోనూ అదేమాట: సోదరికి జగన్ లేఖ
షర్మిల తీరు బాధించింది, నా కూతుళ్ల విషయంలోనూ అదేమాట: సోదరికి జగన్ లేఖ
CM Chandrababu: పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
AP Rains Alert: ముంచుకొస్తున్నఅర్ణబ్‌ తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు భారీ వర్షాలు
ముంచుకొస్తున్నఅర్ణబ్‌ తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు భారీ వర్షాలు
Advertisement

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
Piyush Goyal: పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
Fauzi Chandrabose : 'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
US Iran Tensions: ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
Kobbari Matta Re Release: కొబ్బరి మట్ట రీ రిలీజ్... థియేటర్లలో మళ్ళీ సంపూ ట్రిపుల్ రోల్ ధమాకా
కొబ్బరి మట్ట రీ రిలీజ్... థియేటర్లలో మళ్ళీ సంపూ ట్రిపుల్ రోల్ ధమాకా
Embed widget