అన్వేషించండి

AP MPTC ZPTC Elections Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే

AP ZPTC Elections 2026 | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 21 నుండి 23 వరకు మండల, జడ్పీ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారని అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
  • అక్టోబర్ 21-23 నామినేషన్లు, నవంబర్ 3న పోలింగ్ నిర్వహణ.
  • నవంబర్ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.
  • 662 జడ్పీటీసీ, 9,983 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు.

AP MPTC and ZPTC Elections 2026 | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలో ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఎెన్నికల కమిషర్ అనిల్ చంద్ర పునేఠా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత మాట్లాడుతూ..  ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధిత మండల కేంద్రాల్లో, జడ్పీటీసీ స్థానాలకు జిల్లా పరిషత్ (జడ్పీ) కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపడతారని వెల్లడించారు. జడ్పీ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నిక జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.

అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అక్టోబర్ 24న పరిశీలిస్తారు. అనంతరం పోటీ నుంచి వైదొలగాలనుకునే అభ్యర్థులకు అక్టోబర్ 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు విజేతల్ని ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Code of Conduct) సరిగ్గా అమలు అయ్యేలా పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక నోడల్ అధికారులను ఈసీ నియమించింది.


AP MPTC ZPTC Elections Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే

ఏపీలో తొలిసారి 28 జెడ్పీ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల ప్రజా పరిషత్‌ల పరిధిలో ఉన్న659 జడ్పీటీసీ, 659 ఎంపీపీ స్థానాలకు, 9,829 MPTC స్థానాలకు ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. 2 కోట్ల 81 లక్షల మందికి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నోటిఫికేషన్ విడుదలతో ఏపీలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది.   

MPTC / ZPTC ఎన్నికల షెడ్యూల్ ముఖ్య తేదీలివే

-  ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 19
- RO/EO ఎన్నికల నోటీసు జారీ, నామినేషన్ల ప్రారంభం: అక్టోబర్ 21
- నామినేషన్ల స్వీకరణ ఆఖరి తేదీ: అక్టోబర్ 23, 2026
- నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 24, 2026
- తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్: అక్టోబర్ 25, 2026
- అప్పీళ్ల పరిష్కారించే తేదీ: అక్టోబర్ 26
- నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ: అక్టోబర్ 27
- పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా: అక్టోబర్ 27, 2026 
- పోలింగ్ తేదీ: నవంబర్ 03, 2026
- రీపోలింగ్ (అవసరమైతే): నవంబర్ 04, 2026
- ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన: నవంబర్ 05, 2026

Also Read: Janasena Wins Darsi Municipal Chairman: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం

మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా 

కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు అనిల్‌చంద్ర పునేఠా ప్రకటించారు. నామినేషన్‌ పత్రాలను చించివేసినందున వాటిని పరిశీలించలేమని, ఈ క్రమంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కడప జిల్లా కలెక్టర్‌ నివేదిక మేరకు మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేసినట్లు ప్రకటించారు. త్వరలోనే మైదుకూరు ఎన్నికల ప్రకియకు మళ్లీ నోటిఫికేషన్‌ ఇస్తామనన్నారు. 

Frequently Asked Questions

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఎప్పుడు జరుగుతుంది?

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నవంబర్ 3న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 5న జరిపి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు ఎప్పటి నుండి స్వీకరిస్తారు?

అభ్యర్థుల నుండి నామినేషన్లను ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఎంపీటీసీకి మండల కేంద్రాల్లో, జడ్పీటీసీకి జిల్లా పరిషత్ కార్యాలయాల్లో సమర్పించాలి.

ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎవరు విడుదల చేశారు?

ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

ఈ ఎన్నికల్లో ఎన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది?

ఈ ఎన్నికలు 662 జడ్పీటీసీ స్థానాలకు, 9,983 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా 28 జడ్పీ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Amaravati Vision 2046: అమరావతికి 20 ఏళ్ల మహా ప్రణాళిక.. రూ. 1.33 లక్షల కోట్ల బడ్జెట్, ఖజానాపై పైసా భారం లేకుండా సెల్ఫ్-సస్టైనబుల్ వ్యూహం!
అమరావతికి 20 ఏళ్ల మహా ప్రణాళిక.. రూ. 1.33 లక్షల కోట్ల బడ్జెట్, ఖజానాపై పైసా భారం లేకుండా సెల్ఫ్-సస్టైనబుల్ వ్యూహం!
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget