అన్వేషించండి

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం రానీయకుండా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ 11.43 శాతం వృద్ధి (2021-22) రేటు సాధించడం చాలా గొప్ప విషయం అన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడు లేని విధంగా 11.43 శాతం వృద్ధి రేటును సాధించిందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం రానీయకుండా, ఎన్నికల హామీలను మరవకుండా విపత్తు నుంచి బయటపడిన విధానాన్ని యావత్ ప్రపంచం మెచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ 11.43 శాతం వృద్ధి (2021-22) రేటు సాధించడం చాలా గొప్ప విషయం అన్నారు.

పార్లమెంట్ సాక్షిగా ప్రకటించినా వాళ్లు వినలేదు 
గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన యనమల, 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవమున్న టీడీపీ అధినేత చంద్రబాబు, సామాన్యులకి మంచి, చెడులను చెప్పి చైతన్య పరిచే బాధ్యత కన్నా భయపెట్టడానికే ప్రాధాన్యతనిచ్చారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించినా ప్రతిపక్షలాకు వినపడవు అన్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పనితీరుపై అర్థగణాంక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం స్థిర ధరల అంశంలో ఏపీ జీఎస్డీపీ 11.43 శాతం. ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీదే ఈ విభాగంలో అగ్రస్థానం. వృద్ధి రేటు ఎలా లెక్కిస్తారో, ఆ ప్రక్రియ ఏంటో, వాటిని మీరెలా తారుమారు చేస్తారో అన్నీ తెలుసు కాబట్టే మీ ప్రతి ఆరోపణలపై స్పందిస్తున్నాం అన్నారు మంత్రి బుగ్గన. 

 స్థిర ధరల ప్రకారం లెక్కిస్తేనే రాష్ట్ర జీడీపీ 11.43 శాతం. అదే ప్రస్తుత ధరల ప్రకారం అయితే 18.47 శాతం. ఏ విధంగా లెక్కేసినా (-)4 శాతం అనేది అసంభవం. అసాధ్యం. ఎంత అనుభవజ్ఞులైనా అప్పుడప్పుడు తప్పులు చేయడం సహజం. మీరు కూడా (-)4 శాతం అని పత్రికా ప్రకటనలో ఎప్పటిలాగే తప్పులో కాలేశారని భావిస్తున్నాం అన్నారు. జాతీయ జీడీపీ 8.7శాతం నమోదవగా రాష్ట్ర జీఎస్డీపీ కేంద్ర జీడీపీ కన్నా 2.73 శాతం ఎక్కువగా నమోదు చేసింది. ఇదే ఏడాది గణాంకాలలో తెలంగాణ 10.88 శాతంతో నాలుగో స్థానానికి పరిమితమైంది. 11.04శాతం వృద్ధి రేటుతో రాజస్థాన్, 10.98 శాతంతో బీహార్ రాష్ట్రాలు వరుసగా స్థిర ధరల వృద్ధిరేటులో 2,3 స్థానాల్లో నిలిచాయని చెప్పారు. 

అధిక వృద్ధి రేటు సాధించడానికి అదే కారణం.. 
మొత్తం స్థూల విలువ జోడింపు (GVA)లో వ్యవసాయం, అనుబంధ రంగాల సహకారం 35.47%గా నమోదైంది. వ్యవసాయ రంగంలో మన రాష్ట్ర వృద్ధి రేటు 11.27%గా ఉంది. అఖిల భారత స్థాయిలో ఇది కేవలం 3.0%. ఈ విషయంలో జాతీయ వృద్ధి కంటే మన రాష్ట్రం 8.27% అధికంగా నమోదు చేసి ఎంతో ముందుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల కింద, లైవ్ స్టాక్ 11.63%, హార్టికల్చర్ 9.69%, ఫిషింగ్ , ఆక్వా కల్చర్ లో 9.08%  ఇవే  వృద్ధికి ప్రధాన కారణం.  ఈ లక్ష్య సాధనలో వ్యవసాయం , అనుబంధ రంగాల కింద సాపేక్షంగా అధిక వృద్ధి రేటు సాధించడానికి కారణం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న రైతు సంక్షేమ పథకాలు,కార్యక్రమాలే అన్నారు. 

‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల(RBK) వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి ప్రభుత్వ వినూత్న సంస్కరణలే కారణం.  విత్తనం నుండి పంట విక్రయం వరకు అన్ని సేవలు రైతన్న గడప వద్దనే అందించేలా వన్ స్టాప్ సెంటర్లుగా రాష్ట్రవ్యాప్తంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది. ఇవే కాకుండా ప్రతి గ్రామంలో వీటితో పాటు సచివాలయాలు, మిల్క్ చిల్లింగ్ స్టేషన్లు, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ హెల్త్ క్లినిక్ ల వంటి వేలాది భవనాలు నిర్మించాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క భవనమైనా నిర్మించారా అని యనమల ప్రశ్నించడం హాస్యాస్పదం’గా ఉందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

కోవిడ్ -19 సమయం లో కూడా భారత దేశ వృద్ధిరేటు (-)6.60%  నమోదు అయిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రం 0.08% నమోదు  చేయడం మీకు తెలియదా?. 2018-19 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో 3.54 శాతం జీఎస్డీపీ నమోదైతే... 2021-22 సంవత్సరానికి గానూ 11.27గా నమోదైంది.  2018-19 సంవత్సరంలో పారిశ్రామిక రంగంలో 3.17 శాతం జీఎస్డీపీ నమోదైతే... 2021-22 సంవత్సరానికి గానూ 12.78గా నమోదైంది.  2018-19 సంవత్సరంలో సేవా రంగంలో 4.84 శాతం జీఎస్డీపీ నమోదైతే...2021-22 సంవత్సరానికి గానూ 9.73గా నమోదైంది. 2018-19 ఏడాదికిగానూ టీడీపీ ప్రభుత్వ హయాంలో 5.36 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. 2021-22 సంవత్సరంలో ఏపీ 11.43 శాతం వృద్ధి రేటు నమోదు చేసిందని వెల్లడించారు.

"బీజేపీతో నేరుగా చెలిమి చేసినా తమరి ఐదేళ్ల కాలంలో చేయలేనంత చేస్తున్న మా ప్రభుత్వ సంక్షేమాభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. 40 ఏళ్ళ అనుభవానికి సాధ్యం కాని అభివృద్ధి ఏ అనుభవం లేని యువనాయకుడు 40 ఏళ్లపైన వయసులోనే ఎలా చేస్తున్నాడో అర్థం కాక తలలుపట్టుకున్నారు.  రూ.లక్ష కోట్ల అప్పు కూడా చేయని వైసీపీ ప్రభుత్వాన్ని గత కొన్ని నెలల ముందే రూ.10 లక్షల అప్పు అంటగట్టారు.” పార్లమెంట్ లో సాక్షాత్తు కేంద్రమంత్రి సహా పలు ఆర్థిక వ్యవస్థలు అధికారికంగా గణాంకాలు తేల్చినా టీడీపీ నేతల స్వభావం ఏమాత్రం మారకపోవడం శోచనీయం. అయినా వాస్తవాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉంటాం’ అన్నారు మంత్రి బుగ్గన.

ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,07,771 కోట్లు. భారతదేశం యొక్క తలసరి ఆదాయం రూ. 1,50,007 కోట్లు. అంటే రాష్ట్ర తలసరి ఆదాయం  దేశ తలసరి ఆదాయం కంటే 38.5% ఎక్కువ. తలసరి ఆదాయం అంశంలో  ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో మెరుగ్గా ఉంది. అప్పుల విషయానికొస్తే, టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.2,64,451 కోట్ల రుణ భారంలో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయింది. 2022 మార్చికి ఏపీ అప్పులు రూ.3,98,903 కోట్లని స్వయంగా కేంద్ర ఆర్ధికశాక సహాయక మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్ లో ప్రకటించారు . ఆ లెక్క ప్రకారం, ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,34,452 లక్షల కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం  చేసిన అప్పుతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మీరు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం. అప్పు పెరుగుదల ని పోల్చి చూస్తే, గత ప్రభుత్వ హయాం లో 2014 -19 లో కేంద్ర ప్రభుత్వ CAGR 9.89% పెరిగినప్పుడు, మన రాష్ట్ర CAGR 16.80% పెరిగింది. అదే జగన్  ప్రభుత్వ హయాం లో  కేంద్ర ప్రభుత్వ CAGR 14.37% పెరిగినప్పటికీ మన రాష్ట్ర CAGR 13.28% మాత్రమే పెరిగింది. 

‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు నెమ్మదిగా పెరిగింది (SLOWER PACE) తప్ప మీరు చెప్పినట్టు కాదు. మీరు చేసినంత అసలే లేదు. పైగా మా ప్రభుత్వం చేసింది కూడా కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కుంటూ సంక్షేమ పథకాలు ఏవీ ఆపకుండా ఉండడానికే . రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ, అప్పులు,వడ్డీ,జీడీపీ, జీఎస్టీ ఇలా అన్నింటిలో వాస్తవాలు వేరు. యనమలగారు చెప్పే లెక్కలు వేరు. ప్రతికా ప్రకటనల్లో రాయించే ప్రతి అక్షరం ఓ అబద్ధం.  అప్పులు, వడ్డీలు, జీఎస్‌డీపీ లెక్కలపై సరైన అవగాహన లేకుండా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు టీడీపీ ప్రయత్నించిందని మండిపడ్డారు బుగ్గన.

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO), మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) డిసెంబర్ 2022న  2012లో ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI)ని విడుదల చేసింది. MOSPI ప్రచురించిన ద్రవ్యోల్బణ రేట్లను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రం 7.81%తో భారతదేశంలో అత్యధిక ద్రవ్యోల్బణ రేటును కలిగి ఉంది, తర్వాత మధ్యప్రదేశ్: 6.96, ఉత్తరప్రదేశ్: 6.76, హర్యానా: 6.67 మరియు పంజాబ్ 6.60. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ద్రవ్యోల్బణం దేశంలోనే మొదటిదని మీరు నిరూపిస్తానంటే బహిరంగ చర్చకు సిద్ధమే. నగదు నిర్వహణ, అధిక వడ్డీలు, ష్యూరిటీ లేకుండా ఇష్టమొచ్చినట్లు చేసిన అప్పులు, గుదిబండలా వదిలేసిపోయిన బకాయిలు, అంచనాలు, ఖర్చుపెట్టిన మొత్తాలు, మీ పాలనలో ఉద్యోగులకు జీతాలిచ్చిన తీరు, టీడీపీ హయాంలో నెలల తరబడి జీతాలివ్వక చిన్న ఉద్యోగులను టార్చర్ పెట్టిన అంశాలపై చర్చ పెడతామంటే చర్చించడానికి మేం సిద్ధమే. జన్మభూమి కమిటీల అరాచకాలు, భూముల కుంభకోణాలు, ఫైబర్ నెట్ స్కాం, స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం వీటిపైనా కూడా చర్చిద్దాం రండి అని సవాల్ విసిరారు.

నీతిఆయోగ్, భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో ప్రకటించిన ఎస్డీజీ ఇండెక్స్ ప్రకారం, ఈ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్   72 స్కోరుతో 4వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం మూడేళ్లలో తన స్కోర్‌ను నిరంతరం మెరుగుపరుచుకుంటూ సత్తా చాటుతోంది. 2018-19లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్కోర్ 64 నుండి 2020-21లో ఆ స్కోరు 72కి మెరుగుపడడం ఏపీ ప్రభుత్వ విధానాలకు ప్రతిబింబంగా నిలిచింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
Embed widget