News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Cabinet Decisions: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు ఇవే - మంత్రి వెల్లడి

అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన కొన్ని బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను కేబినెట్ భేటీ అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ విలేకరుల సమావేశంలో వివరించారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన కొన్ని బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను కేబినెట్ భేటీ అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ విలేకరుల సమావేశంలో వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విద్యాశాఖలో అంతర్జాతీయ సౌకర్యాల కల్పనకు (LOI) కు ఆమోదం తెలిపారు. IB సిలబస్ ప్రవేశ పెడతాం. ఏపీలో చదివిన విద్యార్థి ప్రపంచంలో ఎక్కడ కు వెళ్ళినా కమ్యూనికేషన్ కు ఇబ్బంది లేకుండా బాల్యం నుండే Tofel కోర్స్ నేర్పిస్తాం.

ఏపీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ 2023కు ఆమోదం
APGPS పెన్షన్ స్కీమ్ ను ప్రవేశ పెట్టడానికి ఏపీ కేబినెట్ ఆమోదం, దీనిపై అసెంబ్లీలో చర్చిస్తాం
ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి ఇంటి స్థలం ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం. ఉద్యోగుల పిల్లలకు ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ అమలు
జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలపై సూత్రప్రాయ ఆమోదం
ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన డెఫ్ క్రీడాకారిణికి ప్రభుత్వ ఉద్యోగం
వైద్య రంగంలో జీరో వేకెన్సీ పాలసీ అమలకు కేబినెట్ ఆమోదం
ఒంగోలు, ఏలూరు, విజయవాడ నర్సింగ్ కాలేజీల్లో పోస్టుల భర్తీ
ఆరోగ్య సురక్ష పథకం కింద ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని నిర్ణయం
తీవ్ర వ్యాధులతో బాధ పడుతున్న వారికి క్రమం తప్పకుండా వైద్య క్యాంపులు నిర్వహిస్తాం
విలేజ్ క్లినిక్ లలో 162 రకాల మందులు, 18 రకాల పరీక్షలు అందుబాటులో ఉంచుతాం
సెప్టెంబరు 30 నుండి నవంబర్ 15 వరకూ ఈ క్యాంపులు నడుస్తాయి
ప్రైవేటు యూనివర్సిటీ లను క్రమబద్దీకరణ చెయ్యడానికి ఆమోదం
కురుపాం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం
పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు ఆమోదం 
భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం
దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం

ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్సిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రపంచంలోని టాప్‌ 100 యూనివర్శిటీలతో టై అప్‌ చేసేలా చట్ట సవరణ చేస్తాం. దీనివల్ల జాయింట్‌ సర్టిఫికేషన్‌కు వీలు పడుతుంది. ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలోకి వస్తాయి. దీనివల్ల పిల్లలకు మేలు జరుగుతుంది’’ అని మంత్రి వివరించారు.

Published at : 20 Sep 2023 04:06 PM (IST) Tags: AP Assembly session AP Cabinet Minister Venugopal AP Cabinet decisions CM Jagan news

ఇవి కూడా చూడండి

Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!

Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!

Trains Cancelled: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్‌ గడువు పొడిగింపు

Trains Cancelled: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్‌ గడువు పొడిగింపు

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్‌లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా

RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్‌లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు

టాప్ స్టోరీస్

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

Fact Check: కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో పాకిస్థాన్ జెండా అంటూ వీడియో వైరల్ - ఇందులో నిజమెంత?

Fact Check: కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో పాకిస్థాన్ జెండా అంటూ వీడియో వైరల్ - ఇందులో నిజమెంత?