అన్వేషించండి

Andhra Pradesh Working Hours: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం- పని గంటలు 10కి పెంచుతూ ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Working Hours: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పని గంటలు మార్చింది. ప్రైవేట్ ఉద్యోగులు ఇకపై రోజుకు 10 గంటలు పని చేయాలి,

Andhra Pradesh Working Hours:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పరిశ్రమల పని గంటలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రైవేటు రంగంలో పని చేసే ఉద్యోగులు పది గంటలు పని చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం కార్మిక చట్టాల్లో భారీ మార్పులు చేపట్టింది. సవరించిన 'ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీల చట్టం' ప్రకారం ఇప్పటి వరకు 9 గంటలు పని చేసిన ఉద్యోగులు రోజుకు 10 గంటలు పని చేయాల్సి ఉంటుంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 8 గంటలు పని చేయడానికి పరిమితి ఉండేది. కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెట్టుబడులు భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటి. మ్యాన్‌పవర్ అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పని గంటలు కూడా 10 గంటలు చేస్తే పరిశ్రమలు వచ్చేందుకు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పదేళ్ల క్రితం 8 గంటలుగా ఉన్న వర్కింగ్ అవర్స్‌ను 9 గంటలకుపెంచారు. ఇప్పుడు సెక్షన్ 54 కింద మార్పులు చేర్పులు చేసి 10 గంటలు చేశారు. దీనితో పాటు సెక్షన్ 55లో కూడా సవరణలు చేశారు. మొదట ఐదు గంటల పని తర్వాత అరగంట విరామం తప్పనిసరిగా ఉండేది, దీనిని ఇప్పుడు ఆరు గంటల పని తర్వాత ఒక గంట విరామంగా మార్చారు.

ఓవర్ టైం గరిష్ట పరిమితిలో కూడా మార్పు

ఓవర్ టైం గరిష్ట పరిమితిలో కూడా మార్పులు చేశారు. మొదట ఇది 75 గంటలు ఉండగా, ఇప్పుడు 144 గంటలకు పెంచారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రి కె. పార్థసారథి మాట్లాడుతూ, ఈ మార్పులు ప్రభుత్వ "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానంలో భాగమని అన్నారు. నిబంధనలను కొద్దిగా సడలించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ పెట్టుబడులు వస్తాయని, వ్యాపారం చేయడం సులభం అవుతుందని ఆయన అన్నారు.

నిర్ణయాన్ని వ్యతిరేకించిన కార్మిక సంఘాలు 

పని గంటలు పెంచడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. కొత్త నిబంధనల కారణంగా ఫ్యాక్టరీ యజమానులు కార్మికులతో నిర్ణీత సమయం కంటే ఎక్కువ, అంటే రెండు గంటలు అదనంగా పని చేయించుకోవచ్చని వారు అంటున్నారు. దీనివల్ల ఉద్యోగులు రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయాల్సి రావొచ్చు, ఇది వారి ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై పెను ప్రభావం చూపుతుందని అంటున్నారు.

భారత్‌ కార్మిక చట్టాలు, ఫ్యాక్టరీస్ ఆక్ట్-1948, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆక్ట్-1953 ప్రకారం ఎనిమిది గంటల వర్కింగ్ అవర్స్ మాత్రమే అమలులో ఉంది. కానీ ప్లాంటేషన్స్ శ్రామిక చట్టం, 1951 వంటి కొన్ని ప్రత్యేక చట్టాల ప్రకారం కొన్ని రాష్ట్రాల్లోని ప్రత్యేక వెసులుబాటు పొందుతున్నాయి. 10 గంటల వర్కింగ్ అవర్స్‌ను అమలు చేస్తున్నాయి.  అవి అస్సాం (టీ ఎస్టేట్స్), తమిళనాడు (ప్లాంటేషన్స్, టెక్స్టైల్స్), కేరళ (ప్లాంటేషన్స్, కొన్ని ఇండస్ట్రీలు), కర్ణాటక (కాఫీ ఎస్టేట్స్, కొన్ని ఫ్యాక్టరీలు), మహారాష్ట్ర (కొన్ని ఫ్యాక్టరీలు, టెక్స్టైల్స్), పశ్చిమ బెంగాల్ (టీ ఎస్టేట్స్, కొన్ని ఫ్యాక్టరీలు) ఇప్పుడు ఈ జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ కూడా చేరిపోయింది. 

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
Embed widget