మొదట ప్రతిపాదించిన 19 ఇంటర్‌ఛేంజ్‌ల నుండి 2 తొలగించబడటంతో, ప్రస్తుతం 17 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించబడతాయి. వాహనాలు ఈ ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద మాత్రమే ప్రవేశించగలవు లేదా నిష్క్రమించగలవు.
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్లో కీలక పరిణామం.. ఇంటర్‌ఛేంజ్‌లు కుదించడంతో తగ్గిన ప్రాజెక్టు వ్యయం
అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో ఇంటర్‌ఛేంజ్‌లను 17కి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 189.93 కి.మీ. ఆరు లేన్ల రోడ్డుపై కేవలం ఈ ఇంటర్‌ఛేంజ్‌ల వద్దే వాహనాల ఎంట్రీ, ఎగ్జిట్ అవకాశముంటుంది.

- అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో వ్యయం తగ్గించేందుకు మార్పులు చేశారు.
- రెండు ఇంటర్‌ఛేంజ్‌లు రద్దు చేయగా, అంచనా వ్యయం గణనీయంగా తగ్గింది.
- 189 కి.మీ. పొడవునా 17 ఇంటర్‌ఛేంజ్‌లు రూ.30,491 కోట్లకు చేరింది.
అమరావతి: అమరావతి అవుటర్ రింగ్ రోడ్ (Amaravati ORR) ప్రాజెక్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని ఇంటర్ ఛేంజ్‌లు తగ్గించగా, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తగ్గుతుంది. గతంలో 19 ఇంటర్‌ఛేంజ్‌లను మొత్తం 17 ప్రాంతాల్లో నిర్మించనున్నారు. 189.93 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో నిర్మించనున్న ఈ యాక్సెస్ కంట్రోల్డ్ ఔటర్ రింగ్ రోడ్లోకి వాహనాలు ప్రవేశించాలన్నా లేదా బయటకు వెళ్లాలన్నా కేవలం ఈ ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద మాత్రమే వీలుంటుంది.
ప్రాజెక్టు వ్యయం తగ్గింపు - రెండు ఇంటర్‌ఛేంజ్‌ల తొలగింపు
ఈ ఓఆర్ఆర్ మొత్తం 6 నేషనల్ హైవేలను దాటుకుని వెళ్తుండగా, అందులో 8 ప్రాంతాల్లో డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించనున్నారు. రాష్ట్ర, జిల్లా రహదారులను క్రాస్ చేసే ప్రాంతాల్లో సింగిల్ ఇంటర్‌ఛేంజ్, 8 రోటరీ ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులో మొదటగా 19 ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించాలని ప్రతిపాదన చేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 38,450 కోట్లు కాగా.. ఖర్చు తగ్గించాలని జాతీయ రహదారుల సంస్థ (NHAI) ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ORR లోపలి వైపు మాత్రమే సర్వీస్ రోడ్లను ఉంచి, బయటివైపు సర్వీస్ రోడ్ల ప్రతిపాదన తొలగించారు. అలాగే తెనాలి సమీపం నుంచి చెన్నై- కోల్‌కతా హైవేలోని కాజ వరకు నిర్మించాలని చూసిన 17.5 కిలోమీటర్ల 6 వరుసల అనుసంధాన రహదారిని కూడా పక్కన పెట్టారు. దీనివల్ల ఆ రహదారి ఆరంభంలో, ముగింపులో ప్రతిపాదించిన 2 ఇంటర్‌ఛేంజ్‌లు రద్దు చేశారు. ఫలితంగా ఇంటర్‌ఛేంజ్‌లు తగ్గడమే కాకుండా, ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 30,491 కోట్లకు దిగివచ్చింది.
ఇంటర్‌ఛేంజ్ ఎక్కడెక్కడ.. ఏమున్నాయంటే..
1: కంచికచర్ల వద్ద విజయవాడ- హైదరాబాద్ రహదారిపై ORR ఫస్ట్ ఇంటర్‌ఛేంజ్.. ఇక్కడ డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మించనున్నారు.
2: కంచికచర్ల- మధిర స్టేట్ హైవే క్రాస్ అయ్యేచోట పొన్నవరానికి సమీపంలో ORR లోని 3.90 కి.మీ వద్ద రోటరీ ఇంటర్‌ఛేంజ్.
3: విజయవాడ- ఖమ్మం- నాగ్‌పుర్ హైవే (NH-163జి) క్రాస్ అయ్యేచోట దుగ్గిరాలపాడు సమీపంలో ORRలో 18.30 కి.మీ. వద్ద డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మించనున్నారు.
4: విజయవాడ శివారు ఇబ్రహీంపట్నం నుంచి భద్రాచలం, రాయ్‌పూర్ మీదుగా ఉత్తరాఖండ్ వెళ్లే హైవే మీద మైలవరానికి దగ్గరలో ఓఆర్ఆర్లోని 31.29 కి.మీ. వద్ద క్రాస్ ఉంటుంది. ఇక్కడ డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మించనున్నారు
5: అమరావతి ఓఆర్ఆర్లోని 42.50 కి.మీ. వద్ద అడవినెక్కలం- వెల్వడం రోడ్ క్రాస్ అయ్యేచోట రోటరీ ఇంటర్‌ఛేంజ్ ప్లాన్ చేశారు.
6: ఆగిరిపల్లి సమీపంలోని విజయవాడ- నూజివీడు రోడ్ క్రాస్ అయ్యేచోట ORRలో 47.80 కి.మీ. వద్ద డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ కడతారు.
7: చెన్నై- కోల్‌కతా హైవేలో పొట్టిపాడు వద్ద ORR 66.10 కి.మీ. క్రాస్ చేస్తుంది. అక్కడ డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ కడతారు.
8: గన్నవరం- పుట్టగుంట రోడ్ క్రాస్ అయ్యేచోట ORRలో 71.54 కి.మీ. వద్ద రోటరీ ఇంటర్‌ఛేంజ్ నిర్మిస్తారు.
9: విజయవాడ- గుడివాడ రోడ్‌ను మానికొండ వద్ద ఓఆర్ఆర్ 80.31 కి.మీ. క్రాస్ చేస్తుండగా అక్కడ రోటరీ ఇంటర్‌ఛేంజ్ నిర్మిస్తారు.
10: విజయవాడ- మచిలీపట్నం హైవేపై చలివేంద్రపాలెం సమీపంలో ORR 85.90 కి.మీ క్రాస్.. డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ కడతారు.
11: గుంటూరు- హనుమాన్‌పాలెం రోడ్ నందివెలుగు వద్ద ఓఆర్ఆర్ 105.70 కి.మీ. క్రాస్ చేయనుండగా రోటరీ ఇంటర్‌ఛేంజ్ నిర్మిస్తారు.
12: ఓఆర్ఆర్లో 123.20 కి.మీ. వద్ద నారాకోడూరు నుంచి బుడంపాడుకు లింక్ రోడ్డు (స్పర్ రోడ్) నిర్మిస్తుండగా.. నారాకోడూరు వద్ద డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మించనున్నారు.
13: ఓఆర్ఆర్లో 128.70 కి.మీ. వద్ద అనంతవరప్పాడు- ముట్లూరు రోడ్డులో అనంతవరప్పాడు దగ్గర్లో క్రాస్ చేస్తుంది. అక్కడ రోటరీ ఇంటర్‌ఛేంజ్ నిర్మించనున్నారు.
14: గుంటూరు- ప్రత్తిపాడు- పర్చూరు రోడ్డులో పుల్లడిగుంట వద్ద అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 134.90 కి.మీ. క్రాస్ చేస్తుండగా, అక్కడ రోటరీ ఇంటర్‌ఛేంజ్ నిర్మిస్తారు.
15: గుంటూరు శివారులోని పొత్తూరు- లింగాయపాలెం మధ్య చెన్నై- కోల్‌కతాకు వెళ్లే రహదారిని క్రాస్ చేస్తూ ఓఆర్ఆర్ 139.90 కి.మీ వెళ్తుంది. ఇక్కడ డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మించనున్నారు.
16: మేడికొండూరు సమీపంలో వినుకొండ- గుంటూరు హైవేని ORR 149.02 కి.మీ. క్రాస్ చేస్తుండగా, అక్కడ సింగిల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మించనున్నారు.
17: సత్తెనపల్లి- అమరావతి స్టేట్ హైవేని బలుసుపాడు దగ్గర్లో ఓఆర్ఆర్ 170.70 కి.మీ. క్రాస్ చేస్తుంది. రోటరీ ఇంటర్‌ఛేంజ్ నిర్మించనున్నారు.
Frequently Asked Questions
అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఎన్ని ఇంటర్‌ఛేంజ్‌లు ఉన్నాయి?
అమరావతి ORR పొడవు ఎంత మరియు ఎన్ని వరుసలు కలిగి ఉంటుంది?
ఈ అవుటర్ రింగ్ రోడ్ 189.93 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసలతో నిర్మించబడుతుంది. ఇది యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్.
అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వ్యయం ఎందుకు తగ్గింది?
ప్రాజెక్టు వ్యయం తగ్గించడానికి, బయటివైపు సర్వీస్ రోడ్ల ప్రతిపాదనను, 17.5 కి.మీ అనుసంధాన రహదారిని తొలగించారు. దీనివల్ల 2 ఇంటర్‌ఛేంజ్‌లు కూడా రద్దు అయ్యాయి.
అమరావతి ORR ప్రాజెక్టు ప్రారంభ అంచనా వ్యయం ఎంత, ఇప్పుడు ఎంతకు తగ్గింది?
ఈ ప్రాజెక్టు ప్రారంభ అంచనా వ్యయం రూ. 38,450 కోట్లు. మార్పుల తర్వాత ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 30,491 కోట్లకు తగ్గింది.
ట్రెండింగ్ వార్తలు























