అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్- పనులకు డెడ్‌లైన్ పెట్టిన మంత్రి నారాయణ
Amaravati: మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకెళ్తోంది. రైతుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపించనుంది.
Amaravati News: అమరావతి నిర్మాణాలు శరవేగంగా సాగనున్నాయి. సంక్రాంతి తర్వాత దాదాపు పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు ప్రారంభంకానున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించారు. ఇప్పిటకే నిర్మాణానికి సంబంధించి 45 వేల కోట్లు ఖర్చుకు ఆమోదం లభించింది.ఈ మధ్య సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సీఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించి ట్రంక్ రోడ్లు, లేఅవుట్‌లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు రూ.24,276 కోట్లకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు జరిగిన గత 4 సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తంగా రూ.45,249.24 కోట్లకు ఆమోదం లభించింది. అసెంబ్లీని 103 ఎకరాల్లో, 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేని మిగతా రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనంపై నుంచి రాజధానిని తిలకించే సౌకర్యం కూడా కల్పిస్తారు.
Also Read: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
హైకోర్టు భవనాన్ని 20.32 లక్షల చదరపు అడుగులు, 42 ఎకరాల్లో 55 మీటర్ల ఎత్తున 8 అంతస్తుల్లో రూ.1048 కోట్లతో నిర్మించనున్నారు. జీఏడీ (పరిపాలన) భవనాన్ని 17.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 47 అంతస్తులతో సిద్ధం చేస్తారు. దీంతోపాటు మొత్తం 5 టవర్లతో కూడిన వివిధ భవనాలు 68.88 లక్షల చదరపు అడుగులలో రూ.4,688 కోట్లతో నిర్మిస్తారు. ఎల్పీఎస్ మౌలిక సదుపాయాల్లో భాగంగా 4 ప్రధాన రహదారులు, ఇతర సౌకర్యాల కోసం 579.5 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి రూ.9,699 కోట్లు మంజూరు అయింది. ట్రంకు రోడ్లకు రూ.7,794 కోట్లకు, ఎస్టీపీ పనులకు రూ.318 కోట్లు మొత్తంగా రూ.24,276 కోట్లకు లభించింది.
నెలాఖరుకు టెండర్లు : మంత్రి నారాయణ
వచ్చే సోమవారం నాటికి టెండర్లు పిలవనున్నారు. ఈ నెలాఖరుకు టెండర్లు పూర్తయ్యే చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే జనవరి నెలాఖరులోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రపంచంలో టాప్ 5 ఉత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు.
నిర్మాణ పనుల రేట్లు పెరిగిపోయాయి : పురపాలక శాఖ మంత్రి
గత ప్రభుత్వ నేతలు ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేపట్టారని వాళ్లంతా ఒకసారి ఎస్వోఆర్ పరిశీలన చేయాలన్నారు నారాయమ. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అమరావతిలో విధ్వంసం ఏర్పడిందని, ప్రస్తుతం నిర్మాణ పనుల రేట్లు భారీగా పెరిగిపోయాయన్నారు. టవర్స్ 41 శాతం, హైకోర్టుకు 28 శాతం రేట్లు పెరిగాయయన్నారు. ల్యాండ్ పూలింగ్ చేపట్టిన 29 గ్రామాల్లో అన్ని రకాల చర్యలు చేపడతామని, రాజధాని రైతులకు అన్ని రకాల న్యాయం చేస్తామన్నారు. మరోవైపు ఈ టర్మ్‌లో అమరావతికి ఒక రూపం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనికి కనీసం మూడేళ్లు పడుతుందని నారాయణ తెలిపారు.
Also Read: ఇద్దరికీ హెల్మెట్ ఉండాల్సిందే- రోడ్డుపైనే చలాన్లు వసూలు- బండి సీజ్- ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశం