అన్వేషించండి

YSRCP news : నిజం గెలుస్తుంది కాబట్టే చంద్రబాబు జైల్లో - అంబటి రాంబాబు వ్యాఖ్యలు !

నిజం గెలుస్తుంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

 

YSRCP news :  నిజం గెలవాలంటూ చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారని.. నిజం గెలవాల్సిందేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  ఏనాటికైనా నిజం గెలవాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటుంది. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటికీ.. అంటే, దాదాపు 40 ఏళ్లుగా జరుగుతున్న నిజం అందరూ తెలుసుకోవాలన్నారు.  ఇవాళ  నిజం గెలిచి చూపిస్తోంది. కాబట్టే.. చంద్రబాబు  జైల్లోకి వెళ్లారన్నారు.  చంద్రబాబు ఇన్నాళ్లూ తొక్కేసిన నిజాలు ఇవాళ గెలుపు దిశగా పయనిస్తున్నాయి. కాబట్టే.. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులో నిజం గెలుస్తోంది. చంద్రబాబుకు సంబంధించిన ఏ పిటీషన్‌ వేసినా ఆయా కోర్టుల్లో ఫలితంలేకుండా పోతున్నాయన్నారు.  

17ఏను ఎందుకు పట్టుబడుతున్నారు ? 

నిజం గెలవాలని కోరుకునేవాళ్లు పీసీయాక్ట్‌ 17ఏ ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు..? అది నిజం కాదుకదా..? అదొక సాంకేతిక పాయింట్‌నే కదా..?  అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎందుకు ఆ పాయింట్‌ మీదనే పోరాడుతున్నారు..? నిజాల్ని ఓడించాలనే మీ ప్రయత్నం ఏ కోర్టుకెళ్లినా.. ఎక్కడకెళ్లినా విఫలమవుతోంది తప్ప గెలిచే ప్రసక్తేలేదని చెబుతున్నానన్నారు.  విచిత్రమైన విషయమేమంటే, చంద్రబాబు అరెస్టయితే గుండెలు పగిలి కొందరు మరణించారని ప్రాచరం ేచ్సతున్నారని..    105 మంది గుండెలు పగిలి చనిపోయారంటూ..  ఎమోషన్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విమర్శఇంచారు. అయితే  ఎవరూ భావోద్వేగానికి గురికావడం లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 

చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యుల నాటకాలు
 
బాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన, ఆందోళన అంతా ఒక నాటకం- బూటకం. నిజానికి ఆయన సంపూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఈరోజు ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచిన క్రమంలో వెల్లడైన వాస్తవమన్నారు.  ఆయన్ను జడ్జి గారు కూడా ఆరోగ్యం గురించి అడిగారు. అయితే, తనకు పాతిక,ముఫ్పై ఏళ్లుగా ఆరోగ్య సమస్యలున్నాయని మాత్రమే చెప్పారు తప్ప కొత్తగా అనారోగ్యమేదీలేదన్నారన్నరు.   ఆయన అరెస్టయిన మొదట్నుంచీ వారి పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలిసి చాలా సింపతీ డ్రామాలకు ప్రయత్నించారు. సెక్యూరిటీ లేదన్నారు. దోమలన్నారు. స్కిన్‌అలెర్జీ ...అంటూ నానా రచ్చ చేశారు. ఏది చేసినా వారి సింపతీడ్రామాలు మాత్రం రక్తికట్టడం లేదు. ఎందుకంటే, వాస్తవాల్ని ప్రజలు గమనిస్తున్నారు. నిజం ఏనాటికైనా గెలుస్తుంది కాబట్టి.. మీ దుర్మార్గమైన ఆలోచనలు, కుట్రల్ని కట్టిపెట్టాలని మనవి చేస్తున్నానని అంబటి రాంబాబు తెలిపారు. .

మీకే భవిష్యత్తు లేదు.. మీరెవరికి గ్యారంటీ ఇస్తారు? 

చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించడంలేదని మేధావులు, న్యాయ విశ్లేషకులు చెబుతున్నారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.  ఎందుకంటే, ఆయన అవినీతికి సంబంధించిన ఆధారాలు అంత పకడ్బందీగా ఉన్నట్లు వారంతా తేల్చి ప్రజలకు కళ్లకు కట్టినట్లు డిబేట్ల ద్వారా వివరిస్తున్నారన్నారు.   ఈక్రమంలో రూ.కోటాను కోట్లు తీసుకున్న ఢిల్లీ న్యాయవాదులు సైతం బహుశా నారా లోకేశ్‌కు తన తండ్రి భవిష్యత్తు గురించి చెప్పి ఉంటారనుకుంటాను. అందుకనే, రాజకీయాల్లో భవిష్యత్తు లేని నారా లోకేశ్‌ భవిష్యత్‌కు గ్యారెంటీ అని తాపత్రయపడుతున్నారు. ఇన్నాళ్లూ యువగళం అంటూ యాత్ర చేసిన ఆయన  ఇప్పుడు భవిష్యత్తుకు గ్యారంటీ అని ఆరాటపడటంలో అర్ధమేమీలేదు. ఆయన ఆరాటం, పోరాటం ప్రజాక్షేత్రంలో అభాసుపాలవడం ఖాయమని హెచ్చరించారు. 
  
ప్రభుత్వంపై నిందలేయడం మర్యాద కాదు

న్యాయస్థానాల్లో విన్నవించాల్సిన విషయాల్ని అక్కడ వాదించకుండా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్ద ప్రస్తావిస్తూ టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు గందరగోళపరుస్తున్నారన్నారు.  జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారు. ఇప్పటికైనా వారు నిజాల్ని గ్రహించకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు.  చంద్రబాబు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో జ్యుడీషరీ కస్టడీలో ఉన్నారు. జైళ్ల అధికారులకు కోర్టుల నుంచి అందే ఆదేశాల మేరకే చంద్రబాబు విషయంలో బాధ్యతగా ఉంటారు మినహా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు.  ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆదేశాలతో జైళ్లశాఖ అధికారులు నడుచుకునే పరిస్థితి ఉండదన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget