Minister Jogi Ramesh : ట్విట్టర్లో సినిమా డైలాగ్స్ కాదు, పవన్ కు దమ్ముంటే విజయవాడ రావాలి - జోగి రమేష్
Minister Jogi Ramesh : పవన్ కల్యాణ్ పై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్లో కాదు పవన్ కు దమ్ముంటే విజయవాడ రావాలని జోగి రమేష్ సవాల్ విసిరారు.
Minister Jogi Ramesh : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. దేనికీ గర్జనలు అంటూ ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా? అంటూ పవన్ వరుస ట్వీట్లు చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్లపై ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మంత్రి రోజా, అమర్ నాథ్ పవన్ పై విమర్శలు చేశారు. తాజాగా మంత్రి జోగి రమేష్ పవన్ కు దమ్ముంటే విజయవాడ రావాలని సవాల్ విసిరారు.
దేనికి గర్జనలు?
— Pawan Kalyan (@PawanKalyan) October 10, 2022
ప్రజాస్వామ్యాన్ని కులస్వామ్యంగా మార్చేసినందుకా? పాలన వైఫల్యాలు దాచుకొనేందుకు కులాల మధ్య చిచ్చు రేపినందుకా?
చంద్రబాబు చెంచా
పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు చెంచా అంటూ విమర్శలు చేశారు. పవన్ ఉండేది హైదరాబాద్‌లో షూటింగ్స్ విదేశాల్లో ఏపీలో పరిస్థితులు ఏం తెలుసని ప్రశ్నించారు. చంద్రబాబు ఏం చెబితే అది పవన్ ట్వీట్ చేస్తారని ఆరోపించారు. పవన్ ట్వీట్లు కూడా సినిమా డైలాగుల్లానే ఉంటాయన్నారు. 2024లో జనసేనను చంద్రబాబుకు అమ్మేడానికి పవన్ సిద్ధంగా ఉన్నారన్నారు. ట్విట్టర్‌లో కాదు పవన్ కల్యాణ్ కు దమ్ముంటే విజయవాడ రావాలని సవాల్ విసిరారు. పవన్‌ను ప్రశ్నించిన ప్రతి అంశంపై తాను చర్చకు సిద్ధమని మంత్రి జోగి రమేష్ అన్నారు.
పవన్ కల్యాణ్ చంద్రబాబు చెంచా..
— Jogi Ramesh (@JogiRameshYSRCP) October 10, 2022
పవన్..నువ్వు ఉండేది హైదరాబాద్‌లో..
షూటింగ్‌లు విదేశాల్లో...
ఏపీలో గ్రౌండ్ రియాలిటీస్ నీకేం తెలుసు..?
చంద్రబాబు ఏ ట్వీట్ పెట్టమంటే..
పవన్ అది పెడతాడు..!
పవన్ ట్వీట్లు సినిమా డైలాగుల్లానే ఉంటాయి..!
మియావ్ మియావ్ పవన్
ఏపీలో మూడు రాజధానులు, అందుకు మద్దతుగా ఏర్పాటు చేస్తున్న వరుస రౌండ్ టేబుల్ సమావేశాలు, 15న నిర్వహించబోయే విశాఖ గర్జన భారీ సభను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేసిన వేళ, ఏపీ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పవన్ కల్యాణ్ పై వరుస ట్వీట్లు చేస్తూ ఎద్దేవా చేశారు. ‘‘దత్త తండ్రి చంద్రబాబు తరఫున.. దత్త పుత్రుడి పవన్ కల్యాణ్ మియావ్ మియావ్...!’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ‘‘మియావ్.. మియావ్ దత్తపుత్రుడి పవన్ కల్యాణ్ త్రీ క్యాపిటల్స్ః 1 - అంతర్జాతీయ రాజధాని మాస్కో, 2 - జాతీయ రాజధాని ముంబాయి, 3 - పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్’’ అంటూ ఎద్దేవా చేశారు.