అమరావతి గ్రామకంఠం మినహాయింపులకు 08-12-2014ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ తేదీకి ముందు నిర్మాణాలు ఉన్న భూములు లేదా రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Amaravati Lands: అమరావతిలోని గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ క్లారిటీ ఇచ్చింది. 08-12-2014 కటాఫ్ తేదీగా నిర్ణయించింది.

- అమరావతి గ్రామ కంఠం మినహాయింపులకు 08-12-2014 కటాఫ్ తేదీ.
- సీఆర్డీఏ 6,473.72 ఎకరాలను ఎల్‌పీఎస్ నుంచి మినహాయించినట్లు తెలిపింది.
- విజయవాడలో 24,057 కుటుంబాలకు రూ.9,800 కోట్ల ఇళ్ల పట్టాలు.
- ఈ నెల 30న సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ పట్టాలకు సంపూర్ణ హక్కులు.
Amaravati Lands: ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ శనివారం స్పష్టత ఇచ్చింది. 08-12-2014ను కటాఫ్ తేదీగా నిర్ణయించి.. ఆ తేదీకి ముందే నిర్మాణాలు ఉన్న భూములు, చదరపు గజాల ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు చేసుకున్న ప్లాట్లను నిబంధనల ప్రకారం మినహాయింపునకు పరిశీలన చేసినట్లు తెలిపింది. గ్రామ నివాస ప్రాంతానికి దూరంగా ఉన్న ఖాళీ వ్యవసాయ భూములు, కటాఫ్ తర్వాత రిజిస్ట్రేషన్లు జరిగిన భూములకు మినహాయింపు వర్తించదని సీఆర్డీఏ తెలిపింది.
Also Read: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
ఎల్‌పీఎస్ నుంచి మినహాయింపు
ఇప్పటికే 6,473.72 ఎకరాలను ఎల్‌పీఎస్ నుంచి మినహాయించినట్లు సీఆర్డీఏ తెలిపింది. కమిటీకి వచ్చిన 685 దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు పేర్కొంది. రికార్డులు, శాటిలైట్ చిత్రాలు, రిజిస్ట్రేషన్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. తాజా అప్లికేషన్లు, అభ్యంతరాలను జేసీ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఖరారు చేస్తుందని సీఆర్డీఏ ఓ ప్రకటనలో తెలిపింది. అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం అన్ని ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది.
Also Read: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
విజయవాడలో పేదలకు ఇళ్ల పట్టాలు
విజయవాడలో దశాబ్దాల నాటి ఇళ్ల పట్టాల సమస్యకు ఏపీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది. పేదల సొంతింటి కలకు భరోసా కల్పించేందుకు రెడీ అయింది. విశాఖలో 28,445 కుటుంబాలకు పట్టాలిచ్చిన తరహాలో ఈనెల 30న విజయవాడలో మరో భారీ కార్యక్రమం చేపట్టనుంది. 24,057 కుటుంబాలకు రూ.9,800 కోట్ల విలువైన భూమిపై క్రమబద్ధీకరణ పట్టాలను సీఎం చంద్రబాబు అందించనున్నారు. ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన పట్టాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పేదల సొంతింటి కలను నెరవేర్చనున్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీతో ఒక్కో కుటుంబానికి సుమారు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ప్రయోజనం చేకూరనుంది. తమ ఇళ్లకు శాశ్వత హక్కులు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు కోరుతున్నారు. వారి కల సాకారం నేడు సాకారం కానుంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. మొత్తం 15 మండలాల్లోని 617 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 29.86 లక్షల చదరపు గజాల స్థలాలపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయనుంది.
Also Read: హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
Frequently Asked Questions
అమరావతి గ్రామకంఠం మినహాయింపులకు కటాఫ్ తేదీ ఎప్పుడు?
అమరావతి గ్రామకంఠం మినహాయింపులు వేటికి వర్తించవు?
గ్రామ నివాస ప్రాంతానికి దూరంగా ఉన్న ఖాళీ వ్యవసాయ భూములు, కటాఫ్ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్లు జరిగిన భూములకు ఈ మినహాయింపులు వర్తించవు.
విజయవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ ఎప్పుడు, ఎంతమందికి జరగనుంది?
ఈ నెల 30న విజయవాడలో 24,057 కుటుంబాలకు రూ.9,800 కోట్ల విలువైన భూమిపై క్రమబద్ధీకరణ పట్టాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు.
విజయవాడలో ఇళ్ల పట్టాల పంపిణీతో ఒక్కో కుటుంబానికి ఎంత ప్రయోజనం చేకూరుతుంది?
ఈ పట్టాల పంపిణీతో ఒక్కో కుటుంబానికి సుమారు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















