అన్వేషించండి

YSRCP Ali : విజయవాడ పశ్చిమ టిక్కెట్ రేసులోకి అలీ - వైఎస్ఆర్‌సీపీలో కొత్త సమీకరణాలు !

Actor Ali : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ టిక్కెట్ కోసం అలీ ప్రయత్నిస్తున్నారు. అవకాశం కల్పించాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

Ali Trying For Vijayawada West YCP Ticket  :   YSRCP  లో చేరిన తెలుగు కమెడియన్ అలీ అసెంబ్లీ సీటు కోసం తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ  నియోజకవర్గాల స్థాయిలో కాండిడేట్లను భారీగా మారుస్తుండటంతో అలీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ వరుసపెట్టి షాక్‌లు ఇస్తున్న వైఎస్సార్సీపీ మరిన్ని నియోజకవర్గాల్లో కాండిడేట్లను మార్చేందుకు సిద్ధమవుతోంది. మొత్తం మీద 65 స్థానాల్లో సిట్టింగులను మరో చోటకి మార్చడం కానీ.. పూర్తిగా టికెట్లను నిరాకరించడం కానీ చేయాలని ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. చాలా చోట్ల కొత్త ఇన్‌చార్జులను కూడా ప్రకటించేశారు. దీంతో కొత్తగా పార్టీలో చేరిన వారు... ఇప్పటి వరకూ టికెట్ దక్కించుకోని వారంతా తమకు అవకాశం దక్కుతుందేమోనన్న ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

అసెంబ్లీ సీటు అడుగుతున్న అలీ

ఇప్పుడు వైఎస్సార్పీపీ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని ఆశిస్తున్న వారిలో అలీ కూడా చేరారు. టాలీవుడ్ కమెడియన్ అలీ 2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. అప్పటి నుంచే ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది. రాజ్యసభ స్థానానికి పరిశీలిస్తున్నారని.. ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని.. వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి అంటూ రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అయితే ఆయన్ను ఈ ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిలో నియమించారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు 2024లో అసెంబ్లీ సీటు కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. 

గతంలో పలు స్థానాలకు అలీ పేరు పరిశీలన

అలీ తన కుమార్తె వివాహాన్ని గుంటూరుకు చెందిన వ్యక్తితో జరిపించారు. తన కుమార్తె వివాహాన్ని కూడా గుంటూరులో ఘనంగా నిర్వహించడంతో ఆయన గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరిగింది. గుంటూరు ఈస్ట్ సీట్లో ముస్లిం జనాభా ఎక్కువ. చాలా కాలంగా ఆ స్థానాన్ని రెండు పార్టీలు ముస్లింలకు ఇస్తూ వచ్చాయి. అలీ గుంటూరు ఈస్ట్ సీటును ఆశిస్తున్నారని.. ఆయనకు అక్కడ లేదా రాజమండ్రి రూరల్, అర్బన్ స్థానాల్లో ఒకచోట సీటు కేటాయించే అవకాశం ఉందని భావించారు. 

తాజాగా విజయవాడకు అలీ పేరు

అయితే ఇప్పుడు మార్పులు చేర్పులలో విజయవాడ పశ్చిమానికి కూడా ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు ఈస్ట్ సీటును రెండు సార్లు అక్కడ నుంచి గెలిచిన ముస్తఫాకు లేదా ఆయన కుమార్తెకు కానీ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని.. విజయవాడ పశ్చిమ స్థానానికి అలీ పేరును పరిశీలిస్తున్నారని వైఎస్సార్పీసీపీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అక్కడ నుంచి మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని ఆయనకు కూడా చెపినట్లు సమాచారం. వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్‌కు మార్చాలన్న యోచన కూడా ఉంది. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ ఓటింగ్ ఎక్కువుగా ఉంది. ఆయన్ను కాదని అక్కడ వెల్లంపల్లికి ఇవ్వడం కూడా అనుమానమే. ఆ లెక్కన వెల్లంపల్లికి పూర్తిగా టికెట్ నిరాకరించే అవకాశం కూడా ఉంది.

ముస్లిం ఓట్లే కీలకం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం ఓట్ల సంఖ్య ఎక్కువుగా ఉంది. ఇంతకు ముందు ఈ నియోజకవర్గం నుంచి ఎంకే బేగ్ గెలిచి మంత్రయ్యారు. జలీల్ ఖాన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీపీఐ నుంచి నాసర్‌వలీ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం కూడా నాగుల్ మీరాకు రెండు సార్లు టికెట్ ఇచ్చింది. వన్‌టౌన్‌ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువుగా ఉండటంతో ప్రధాన పార్టీలు ముస్లిం అభ్యర్థికి ప్రాథాన్యం ఇస్తూ వచ్చాయి. వెల్లంపల్లిపై వ్యతిరేకత ఉన్నందున ఈసారికి కొత్త కాండిడేట్‌ను తేవాలని వైసీపీ అనుకుంటోంది. ఈ పరిస్థితిని అలీ వినియోగించుకుంటున్నారు. ముస్లింగా తనకున్న అనుకూలతతో పాటు.. టాలీవుడ్‌ నటుడిగా తనకున్న ఇమేజ్, ప్రజలందరికీ పరిచయం ఉన్న ఫేస్ కావడం అలీకి కలిసొచ్చే అవకాశం ఉంది. వైసీపీ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలీ ఇప్పటికికే నియోజకవర్గంలోని కొందరు నాయకులకు, పరిచయస్తులకు ఫోన్ చేసి పరిస్థితులపై వాకబు చేసినట్లు తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

JanaSena Candidates List: జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ
జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ
AP Local Body Elections: ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు.. కఠిన చర్యలు తప్పవన్న ఎస్ఈసీ
ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు.. కఠిన చర్యలు తప్పవన్న ఎస్ఈసీ
దుర్గాష్టమి: నవరాత్రుల్లో ఎనిమిదో రోజు విశిష్టత, ఆయుధ పూజ ప్రాముఖ్యత!
దుర్గాష్టమి: నవరాత్రుల్లో ఎనిమిదో రోజు విశిష్టత, ఆయుధ పూజ ప్రాముఖ్యత!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget