అన్వేషించండి

Rapaka : జనసేన ఎమ్మెల్యే రాపాకకు అనర్హతా ముప్పు - ఎన్నికల సంఘం ఏం ఆదేశించిందంటే ?

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ఓ ప్రకటన ఆయనను ఇబ్బందుల్లోకి నెడుతోంది.


Rapaka :  జనసేన  తరఫున గెలిచి వైసీపీ  అనుబంధంగా పనిచేస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌  పై అనర్హతా ముప్పు పొంచి ఉంది. తాను దొంగ ఓట్లతో గెలిచానని బహిరంగంగా ప్రకటించుకున్న వీడియో వైరల్ అయింది.  ఈ వీడియోపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  కలెక్టర్ ను ఆదేశించారు.  రాపాక వరప్రసాద్‌పై  రాజోలుకు చెందిన ఎనుముల వెంకటపతిరాజు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అంతర్వేది దేవస్ధానం గ్రామంలో ఈ ఏడాది మార్చి 24న రాపాక ఎన్నికల అక్రమాలను అంగీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.                                                

తాను ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా దొంగ ఓట్లు వేశారని పేర్కొన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి . ఆ వీడియో ఆధారం తన వద్దకు వచ్చినందున ఈ ఫిర్యాదుపై సమగ్ర రిపోర్టు ఇవ్వాలని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. వారం రోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు రాసిన లేఖలో ఉంది. అయితే.. ఇప్పుడీ వ్యవహారంలో రాపాక ఏం చేయబోతున్నారనే దానిపై ఆయన అభిమానులు, అనుచరుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.                                               
 

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాపాకను టీడీపీ ఉండి ఎమ్మెల్యే రామరాజు కొనబోయారని  ఎమ్మెల్యేనే చెప్పడంతో పెద్ద రచ్చే జరిగింది. సరిగ్గా ఇదే టైమ్‌లోనే రాపాక నోటి నుంచి దొంగ ఓట్ల వ్యవహారం బయటికొచ్చింది. దీంతో ఈ రెండూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాను గెలవడానికి దొంగ ఓట్లే కారణంమని ఒప్పుకున్నారు. వరప్రసాద్‌కు తన సొంత గ్రామం చింతలమోరిలో అభిమానుల ఆత్మీయ సమావేశంలో రాపాక గుట్టు విప్పారు. అభిమానులు, స్నేహితులను చూసిన రాపాక... తన మనసులోని మాటను బయటపెట్టారు. ‘చింతలమోరిలో మా ఇంటి దగ్గర బూత్‌లో కాపుల ఓట్లు ఉండవు. అన్నీ ఎస్సీల ఓట్లే ఉంటాయి. ఎవరో ఎవరికీ తెలిదు. సుభాష్‌తో పాటు వీళ్లంతా జట్టుగా వచ్చి ఒక్కక్కరు దొంగ ఓట్లు వేసి వెళ్లిపోయేవాళ్లు. పదిహేను, ఇరవై మంది వచ్చేవాళ్లు, ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేవాళ్లు. ఏకంగా ఈ ఓట్ల వల్ల 800 ఓట్ల వందల మెజార్టీ వచ్చింది’ అని రాపాక తన గెలుపు రహస్యాన్ని బట్టబయలు చేశారు.

 ఇప్పుడు జిల్లా కలెక్టర్ అసలేం జరిగింది..? రాపాక మాటల్లో నిజమెంత..? ఇలా అన్ని విషయాలను నిశితంగా పరిశీలించి ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందజేయాల్సి ఉంది. ఈ నివేదికను బట్టి రాపాకపై ఈసీ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. నివేదిక ఎలా ఉంటుందో..? అన్నదానిపై తదుపరి చర్యలు ఉండొచ్చు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Assembly Botsa Chit Chat: చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. పవన్ సీఎం కావొచ్చు - బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. పవన్ సీఎం కావొచ్చు - బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
Chandrababu Assembly: లడ్డూ కల్తీ ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
లడ్డూ కల్తీ ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Keshineni Chinni vs Kolikapudi: టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
Social Media Ban for Children: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన
13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన

వీడియోలు

Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Azharuddin : కొత్త గవర్నర్‌పైనే ఆధారపడి ఉన్న అజహర్ మంత్రి పదవి - ఎమ్మెల్సీ ఫైల్ క్లియర్ చేయకపోతే రాజీనామానే !
కొత్త గవర్నర్‌పైనే ఆధారపడి ఉన్న అజహర్ మంత్రి పదవి - ఎమ్మెల్సీ ఫైల్ క్లియర్ చేయకపోతే రాజీనామానే !
Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Tamil Nadu Assembly Elections 2026 : ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
Sampradayini Suppini Suddapoosani Review - 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
TTD News: ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
Embed widget