RCB vs CSK IPL 2024 Preview | Virat Kohli | చెన్నై ఓడినా ఫ్లే ఆఫ్స్ కు వెళ్లవచ్చు.. ఎలాగంటే..! | ABP
RCB vs CSK IPL 2024 Preview | Virat Kohli | RCB vs CSK.. ఈ యుద్ధానికి ఉండే క్రేజే వేరు. అలాంటింది.. ఈ రోజు ఎవరు గెలిస్తే వారిదే ప్లే ఆఫ్స్ లో 4వ బెర్త్. దీంతో.. ఈ వార్ కు మరింత క్రేజ్ వచ్చింది. బెంగళూరులో వర్షం పడేలా ఉందని ఉంటున్నారు. ఒకవేళ వర్షం పడకుంటే మాత్రం ఈ ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్ టైన్మెంట్ మ్యాచ్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే..ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టాలంటే ఆర్సీబీ ఈ ఈక్వేషన్ లో గెలిస్తేనే అది సాధ్యమవుతుంది. 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించిన చెన్నై 0.528 రన్‌రేట్ తో ఉంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న బెంగళూరు రన్‌రేట్‌లో 0.387 వెనకబడివుంది. చెన్నైని అధిగమించి ప్లేఆఫ్స్ బెర్తు సంపాదించాలంటే.. మొదట బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. లేదంటే 11 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించాలి. అంటే 18.1 ఓవర్స్ లో అనమాట. అలా కాకుండా ఆర్సీబీ నార్మల్ గా విజయం సాధిస్తే అప్పుడు చెన్నై, ఆర్సీబీ పాయింట్స్ సేమ్ 14 అవుతుంది. చెన్నై రన్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ జట్టే ప్లే ఆఫ్స్ లోకి వెళ్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఆర్సీబీ అద్భుతంగా ఆడాల్సిందే. .