365 dishes for Godavari Son-In-Law| గోదారోళ్ల మర్యాదలా మజాకా.భోజనానికి పిలిస్తే మరి మామూలుగా ఉండదండి
ఆతిథ్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలు తో వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు.ఇక కొత్త అల్లుళ్లులకు అయితే ఆ మర్యాదలే వేరు.ఈ సంక్రాంతి కి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో తన మనవరాలి కాబోయే భర్తకు 365 రకాల వంటకాలతో భారీ విందును ఇచ్చారు ఓ తాతయ్య. మనవరాలికి కాబోయే భర్తను సంక్రాంతి కి ఇంటికి భోజనానికి ఆహ్వానించి మరిచిపోలేని ఆతిథ్యమిచ్చారు. అన్నం,పులిహార,బిర్యానీలు,దద్దోజనం వంటి వంటకాలు తో పాటు,30 రకాల కూరలు,వివిధ రకాల పిండివంటలు,100 రకాల స్వీట్స్,19 రకాల హాట్ పదార్ధాలు,15 రకాల ఐస్ క్రీం లు,35 రకాల డ్రింక్ లు,35 రకాల బిస్కెట్లు,15 రకాల కేక్ లున్నాయి. నరసాపురం కి చెందిన ఆచంట గోవింద్ నాగమణి దంపతులు తమ కూతురు అత్యం మాధవి,వెంకటేశ్వరరావు దంపతుల ఏకైక కుమార్తె కుందవి కి తణుకు కి చెందిన ఎన్నారై తుమ్మలపల్లి సాయి కృష్ణ తో వివాహం నిశ్చయం అయ్యింది.సంక్రాంతి పండుగ సందర్భంగా కాబోయే నూతన వధూవరులను గోవిందు తన నివాసానికి భోజనానికి పిలిచి 365 రకాల వంటకాలతో ఆతిథ్యమిచ్చారు.