News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

MLC What Next : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కేసీఆర్ కొత్త పేర్లు ప్రతిపాదిస్తారా ? మళ్లీ వారి పేర్లే పంపుతారా ?

ఆ రెండు ఎమ్మెల్సీలకు మళ్లీ కొత్త పేర్లు సిఫారసు చేస్తారా ? మళ్లీ ఆ పేర్లనే కేసీఆర్ ప్రతిపాదిస్తారా ?

FOLLOW US: 
Share:

 

MLC  What Next :  గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తెలంగాణ మంత్రివర్గం సిఫారసు చేసిన పేర్లను గవర్నర్ తమిళిశై సౌందరరాజన్ తిరస్కరించారు.  దాసోజు శ్రావణ్‌, కుర్ర సత్యనారాయణ పేర్లను తిరస్కరిస్తున్నట్టు గవర్నర్‌ ప్రభుత్వానికి లేఖ పంపారు.  వారిద్దరికీ  ఆర్టికల్‌ 171 (5) ప్రకారం వారి అర్హతలు సరిపోవని ఆమె స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ యోగం లేనట్లేనా ? కేసీఆర్ మళ్లీ వారి పేర్లనే కేబినెట్ లో తీర్మానం చేయించి గవర్నర్‌కు  పంపుతారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. 

ఇటీవలి కాలంలో అన్ని నియామకాలు రాజకీయ పరమైనవే ! 

దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ పేర్లను నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు తిరస్కరిస్తూ గవర్నర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తగిన అర్హతలు లేకుండా వారిని నామినేట్‌ చేయడం తగదు. అర్హతలు ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నారు. అర్హులను పరిగణనలోకి తీసు కోకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు సిఫార్సు చేయడం సరైంది కాదు. ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్‌ చేయ కూడదో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉంది. మంత్రివర్గ సిఫార్సులో అన్ని అంశాలను జత చేయలేదు…’ అని గవర్నర్‌ పేర్కొన్నారు. కానీ ఇటీవలి కాలంలో గవర్నర్ కోటాలో కేబినెట్ సిఫారసు చేస్తున్న అన్ని పేర్లు రాజకీయ పునరావాసం కోసమే. పాడి కౌశిక్ రెడ్డి కి ఆమోదం తెలిపేందుకు గవర్నర్ నిరాకరించడంతో .. ఆ పేరు వెనక్కి తీసుకుని మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును కేబినెట్ సిఫారసు చేసింది. తమిళిసై వెంటనే ఆమోదం తెలిపారు. కానీ వివాదాల్లేని దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను తిరస్కరించారు. 

ఇటీవలి కాలంలో ఏపీలో కేసులున్న రాజకీయ నేతలకూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు

గవర్నర్లు కేబినెట్ సిఫారసు చేసిన ఎమ్మెల్సీలను తిరస్కరించిన సందర్భాలు దాదాపుగా లేవు. ఇటీవలి కాలంలో అన్ని రాష్ట్రాల్లో రాజకీయ నేతల్నే గవర్నర్ కోటాలో సిఫారసు చేస్తున్నారు.  ఏపీలో కూడా అక్కడి ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను నామినేట్ చేసింది. అప్పట్లో బిశ్వభూషణ్ హరిచందన్, ఇప్పుడు  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన అబ్దుల్ నజీర్ కూడా ఏపీ ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు.   ఏపీ నుంచి గవర్నర్ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన వారి పేర్లను పరిశీలిస్తే..  తోట త్రిమూర్తులు,  లేళ్ల అప్పిరెడ్డి , కుంభా రవిబాబు, కర్రి పద్మ అనే వాళ్లు ఉన్నారు. వీరంతా రాజకీయ నేతలే. పైగా తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డిపై  తీవ్రమైన కేసులు ఉన్నాయి. వీరి పేర్లను ఏపీ గవర్నర్లు ఆర్టికల్‌ 171 (5) ప్రకారం వెనక్కి  పంపలేదు. ఆమోద ముద్రవేశారు.

మళ్లీ అవే పేర్లను ప్రభుత్వం పంపితే ఆమోదించాల్సిందేనా ?

పేరుకు గవర్నర్ కోటా కానీ.. గవర్నర్ ఎమ్మెల్సీలను నామినేట్ చేయలేరు.  మంత్రివర్గం చేసిన సిఫారసును మాత్రమే ఆమోదించాలి. ఎమ్మెల్సీల విషయం కాకుండా బిల్లులు, ఇతర విషయాల్లో అయితే  ఓ సారి గవర్నర్ వెనక్కి పంపితే.. రెండో సారి అదే బిల్లును పంపితే గవర్నర్ ఆమోదించాలనే సంప్రదాయం ఉంది. ఆ ప్రకారం ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలను పట్టుదలగా మళ్లీ  తెలంగాణ కేబినెట్ లో సిఫారసు చేసి పంపిస్తే.. ఆమోదించాల్సిన పరిస్థితి ఉంటుందని  భావిస్తున్నారు. కొత్త పేర్లను పంపిస్తే పెద్దగా పంచాయతీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ కోటా లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. 

Published at : 26 Sep 2023 03:31 PM (IST) Tags: Governor Tamilisai MLCs Telangana Politics Governor Quota MLCs

ఇవి కూడా చూడండి

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస

బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస

No Wishes From KCR: కేసీఆర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు విష్ చేయలేదు?

No Wishes From KCR: కేసీఆర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు విష్ చేయలేదు?

KCR News: సింహం త్వరలోనే బయటికి వస్తుంది - కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

KCR News: సింహం త్వరలోనే బయటికి వస్తుంది - కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

BRS MLA KTR: నిరాశ చెందవద్దు, బీఆర్ఎస్ కు త్వరలోనే మంచిరోజులు: కేటీఆర్

BRS MLA KTR: నిరాశ చెందవద్దు, బీఆర్ఎస్ కు త్వరలోనే మంచిరోజులు: కేటీఆర్

టాప్ స్టోరీస్

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ