Idupu Kayitham: ఇడుపు కాయితం అంటే ఏమిటి? దీనికి తెలంగాణలో ఇంకేం అర్థాలు ఉన్నాయ్?
Idupu Kayitham Meaning: ప్రియదర్శి, నాగదుర్గ జంటగా 'ఇడుపు కాయితం' సినిమా మొదలైంది. ఆ టైటిల్ అర్థం ఏమిటి? అని సెర్చ్ చేసిన జనాలు ఉన్నారు. ఆ ట్రెండింగ్ వర్డ్ వెనుక హిస్టరీ తెలుసుకోండి.

Idupu Kayitham Meaning Explained: ఇడుపు కాయితం... ఇప్పుడీ పదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ విధంగా రెండు ప్రాంతాలకు చెందిన కొందరు 'ట్విట్టర్ వార్'కు తెర తీశారు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు మొదలు అయ్యింది? ఆ పదానికి అర్థం ఏమిటి? అనేది తెలుసుకుందాం రండి.
ప్రియదర్శి హీరోగా 'ఇడుపు కాయితం'
Priyadarshi Idupu Kayitham Movie: ఇటీవల ప్రియదర్శి కథానాయకుడిగా 'ఇడుపు కాయితం' మొదలైంది. ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆ సినిమా పూజకు హాజరయ్యారు. ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అల్లు అరవింద్, సుకుమార్, దిల్ రాజు వంటి ప్రముఖులు చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంస్థలపై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమా పూజ తర్వాత 'ఇడుపు కాయితం' అంటే ఏమిటి? అనే ప్రశ్న మొదలైంది.
'ఇడుపు కాయితం' అంటే ఏమిటో తెలుసా?
What Is Idupu Kayitham?: 'ఇడుపు కాయితం' అంటే విడాకుల పత్రం. ఇప్పుడు డివోర్స్ తీసుకోవాలంటే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే... కొన్నాళ్ళ క్రితం పెద్దల మధ్య పంచాయితీలు జరిగేవి. కలిసి బ్రతకలేమని నిర్ణయించుకున్న భార్యాభర్తలు... పెద్దల సమక్షంలో ఇరువురి కుటుంబ సభ్యులు హాజరు అవ్వగా విడిపోతున్నామని ఒప్పంద పత్రాలు రాసుకునేవాళ్ళు. వాటిని 'ఇడుపు కాయితం' అనేవాళ్ళు.
View this post on Instagram
'ఇడుపు కాయితం' అనేది తెలంగాణ పదం. స్పష్టంగా చెప్పాలంటే... మ్యూచువల్ డివోర్స్ అనొచ్చు. 'మా విడాకులు'ను పర్యాయ పదంగా కూడా పేర్కొనవచ్చు. వై? ఎందుకు? అంటే ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు కనుక. ఇడుపు కాయితాన్ని 'సోడ్ చిట్టి', 'చోడ్ చిట్టి' అని కూడా పిలుస్తారు. అదీ సంగతి! ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో కొన్ని జంటలు కోర్టులను ఆశ్రయించకుండా... పెద్దల సమక్షంలో 'ఇడుపు కాయితం' రాసుకుని విడిపోతున్నారు. ఆంధ్రాలో కూడా ఈ తరహా సంప్రదాయం ఉంది. పెద్దల సమక్షంలో పేపర్స్ మీద సంతకాలు చేసి విడిపోతున్నారు.
తెలంగాణ మాండలికంలో 'ఇడుపు కాయితం' అనేది ఓ భాగం. అయితే... ఆంధ్ర ప్రాంత ప్రజలకు మాత్రమే కాదు, తెలంగాణలో కొంత మందికి కూడా ఆ పదానికి అర్థం తెలియలేదు. అందుకని, ఎక్కువ మంది సెర్చ్ చేశారు. కొందరు అర్థం తెలిశాక... ఎవరికీ తెలియని పదాలను టైటిల్ పెట్టడం ఎందుకని కామెంట్స్ చేశారు. అది వివాదానికి దారి తీసింది. సోషల్ మీడియాలో ఎవరో కొందరు చేసిన కామెంట్స్ వల్ల రెండు ప్రాంతాల ప్రేక్షకులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?
ట్రెండింగ్ వార్తలు






















