అన్వేషించండి

Errabelli Dayakar Rao: అవార్డులతో పాటు డబ్బులు కూడా ఇవ్వండి - కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి రిక్వెస్ట్

Errabelli Dayakar Rao: అవార్డులతో పాటు రాష్ట్రానికి డబ్బులు కూడా ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రాన్ని కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు.

Errabelli Dayakar Rao: కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వివరాలు తెలుసుకుని, అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి అవగాహన లేదని ముక్కుకు, మూతికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా కంటి వెలుగు రెండో దశ సన్నద్ధత కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 4 స్టార్ రేటింగ్ అవార్డుల్లో మొదటి మూడు తెలంగాణ రాష్ట్రానికి రావడం పట్ల అభినందనలు తెలిపారు. మొదటి మూడు స్థానాల్లో వచ్చిన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చేయొద్దు..

3 స్టార్ రేటింగ్ అవార్డులలో మొదటి అవార్డు సిద్దిపేటకు, రెండవది జగిత్యాల జిల్లాకు రావడం విశేషం అన్నారు. 2 స్టార్ రేటింగ్ అవార్డులలో కూడా మొదటి స్థానం తెలంగాణకి రావడం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుకు, పాలనాదక్షతకు నిదర్శనం అన్నారు. అవార్డులను ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పైన కక్ష సాధింపు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి కేంద్రం నిధులు మళ్లిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. కేంద్రం నుంచి గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ అధికారులను హైదరాబాద్ కు తీసుకొస్తే హైదరాబాదులోని తమ శాఖ అధికారులను తీసుకొచ్చి మీరు ఇచ్చిన డబ్బులు మళ్లించామా లేదా అనే సమాధానం చెప్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కల్లాల పేరు మీద 1100 కోట్ల రూపాయలను ఆపారని చెప్పారు. కల్లాలకు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే... 1100 కోట్లు రూపాయలు ఎందుకు ఆపారని ప్రశ్నించారు. 

కల్లాలు కడుతున్నామని కేంద్రానికి లేఖ రాసినప్పుడే అనుమతి ఇవ్వకపోతే కట్టేవాళ్లం కాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కట్టిన తర్వాత ఇప్పుడు వద్దు అనడం సమంజసం కాదన్నారు. కల్లాల కోసం ఖర్చు చేసిన 150 కోట్లు కేంద్రానికి కడతామని రాత పూర్వకంగా రాసిచ్చిన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదన్నారు. ఇది కేంద్రం పొరపాటు కాదా అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు ఆరు నెలలుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక ఇబ్బందులు పడుతున్నాం అన్నారు. మేం చెప్పే దాంట్లో తప్పులు ఉంటే లెక్కలు తెప్పించుకొని అవగాహన చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బకాయి పడలేదన్నారు. కేంద్రం నుంచి సమయానికి నిధులు రాక ఇబ్బంది అవుతుందని తెలిపారు. కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు డబ్బులు వేస్తోందని.. కావాలంటే అధికారుల ద్వారా చెక్ చేసుకోవచ్చని చెప్పారు. 

బండి సంజయ్ కి అవగాహన లేకుండా మాట్లాడతారని మూతికి, ముక్కుకు తేడా తెలియదని అన్నారు. అందుకే ఆయనకు రిప్లై ఇవ్వాలనుకోవట్లేదని వివరించారు. బండిని గుండు అంటారని, గుండును బండి అంటారని.. ఆయనకేమీ తెలవదని ఎద్దేవా చేశారు. కానీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి దయచేసి అవగాహనతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రమే ఇన్ని అవార్డులు ఇచ్చారు. కానీ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. గుజరాత్ కు ఏ అవార్డులు ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని డబ్బులు వచ్చే విధంగా కనీస ప్రయత్నం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి , జిల్లా కలెక్టర్ శివలింగయ్య తదితరులు ఉన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget