By: ABP Desam, Naveen Chinna | Updated at : 26 Sep 2023 05:24 PM (IST)
ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ!
BJP vs Congress in Telangana Elections 2023:
తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ 115 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ఇదివరకే ప్రకటించి యుద్ధ రంగంలో దిగిపోయింది. కానీ, మొన్నటి వరకు బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న బీజేపీలో సప్పుడు లేదు. చేరికలతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొంటే... బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి దిగిపోయాక ఆ పార్టీలో జోష్ తగ్గింది. అసలేందకీ పరిస్థితి అన్నది ఇక్కడ తెలుసుకుందాం...!
డిసెంబర్ ఫస్ట్ వీక్ లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ తొలి వారం తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ తరుణంలో ఊపు మీదున్న బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆ పదవి తొలగించారు. బీజేపీ కి సపరేట్ గా ఉన్న లెక్కల ఆధారంగా మంచి జరుగుతుందనే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఐతే.. బండి సంజయ్ తెచ్చిన ఊపును కొత్తగా వచ్చిన బీజేపీ రాష్ట్ర బాస్ కిషన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారా..? అంటే లేదనే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ మధ్య చేపట్టిన నిరుద్యోగ దీక్ష తప్ప.. జనాల్లోకి వెళ్లేలా భారీ కార్యక్రమాలు చేపట్టలేదు. దానికి కూడా పెద్దగా ఆదరణ దక్కలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. బండి సంజయ్ మాటలు జనాలకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. కేసీఆర్ కుటుంబం స్టైల్ లోనే కౌంటర్లు ఇవ్వడంతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలా కాదు కదా హుందాగా మాట్లాడుతారు. అది మాస్ జనాలకు అంతగా ఎక్కట్లేదు. ఇదో పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు.
చేరికల విషయానికొస్తే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ తప్ప పెద్ద నాయకులు ఎవరూ బీజేపీలో చేరలేదు. మరోవైపు కాంగ్రెస్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతురావు వంటి లీడర్లు చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో సరికొత్త జోష్ వచ్చింది. 6 గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో కు జనాల్లో మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు జేపీ నుంచి అలాంటి ప్రకటనల ఊసే లేదు .
కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిర్థత్వానికి 50వేలు పెట్టి నమోదు చేసుకోమంటే ఎగబడి మరీ 1000 మంది అప్లై చేశారు. దీనిని బట్టే చెప్పోచ్చు అక్కడ ఎంత పోటీ ఉందో..! త్వరలోనే 70 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ మాత్రం ఫ్రీగా అప్లై చేసుకోమని చెప్పినప్పటికీ.. 50కిపైగా స్థానాల్లో బలమైన అభ్యర్థులు కానరావడం లేదని సర్వేలు అభిప్రాయపడుతున్నాయి. ఎక్కడి నుంచి ఛాన్స్ వస్తుందో తమకే క్లారిటీ లేక కొందరు మూడు, నాలుగు స్థానాల నుంచి దరఖాస్తు చేసుకున్నారు. బీజేపీలో ఇమడలేని కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది కాక.. లిక్కర్ కేసులో కవితపై బీజేపీ పెద్దలు సైలెంట్ గా ఉండటం.. ఇతర అంశాల కారణంగా బీజేపీ-బీఆర్ఎస్ దోస్తులు అనే భావన కూడా ఓ వర్గంలో ఉంది.
ఇలా ఎటు చూసినా గత 2 నెలల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ గ్రాఫ్ ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కనుక ఇదే జోష్ కొనసాగిస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అన్న భావన కాంగ్రెస్ పై పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరీ.. ఈ నెగెటివిటీని దాటుకుని బీజేపీ ఎలా ముందడుగు వేస్తుందన్నది ఇక్కడ వినపడుతోన్న ప్రశ్న. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనన్న బీజేపీ ఏ నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ హామీలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థుల జాబితా విడుదలయ్యాక బీజేపీ నేతల్లో ప్రచారంలో దూసుకెళ్తారా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస
No Wishes From KCR: కేసీఆర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు విష్ చేయలేదు?
KCR News: సింహం త్వరలోనే బయటికి వస్తుంది - కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
BRS MLA KTR: నిరాశ చెందవద్దు, బీఆర్ఎస్ కు త్వరలోనే మంచిరోజులు: కేటీఆర్
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
/body>