అన్వేషించండి

Praja Palana Website: ప్రజాపాలన కోసం ప్రత్యేక వెబ్‌సైట్, సోమవారం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

praja palana telangana gov in: తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహణ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందించింది. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రజా పాలన వెబ్ సైట్ ప్రారంభించనున్నారు.

Praja Palana Website: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహణ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందించింది. ప్రజాపాలన పై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్-సైట్  prajapalana.telangaana.gov.in ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగిన ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 (కోటి 25 లక్షల 84 వేల 3 వందల 83) దరఖాస్తులు వచ్చాయి. గ్యారంటీల అమలు కోసం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దారఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సోమవారం (జనవరి 8న) డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సి.జి.జి డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమీషనర్  తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరుకానున్నారు.  ఈ సమావేశంలో ప్రజాపాలన పై తయారుచేసిన వెబ్ సైట్ https://prajapalana.telangana.gov.in/ లాంచ్ చేయనున్నారు.
 
ప్రజాపాలనలో భారీగా వచ్చిన దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో మొత్తం 1,25,84,383 (కోటి 25 లక్షల 84 వేల 3 వందల 83) దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారేటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర abhyardanalaku సంబంధించి 19 ,92 ,747 ఉన్నాయి. రాష్ట్రంలోని 16 , 392 గ్రామ పంచాయితీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించగా, ఈ గ్రామ సభల్లో 1 ,11 ,46 ,293 మంది పాల్గొన్నారు. ఈ ప్రజాపాలనలో మొత్తం 3 ,714 అధికార బృందాలు పాల్గొని దరఖాస్తుల స్వీకరణకు 44 ,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ ఎంసీ లోని అయిదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులనన్నింటినీ జనవరి 17 వ తేదీ లోగా డేటా ఎంట్రీ ని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు.  
జిల్లాల వారీగా దరఖాస్తుల సంఖ్య (లక్షల్లో )
- హైదరాబాద్ :  13 .7 
- రంగారెడ్డి      : 10 . 2 
- మేడ్చల్ మల్కాజిగిరి  :  9 .2 
- నల్గొండ      :  6 .1 
- నిజామాబాద్ : 5 .9 
- ఖమ్మం :        5 .5 .
- సంగారెడ్డి :     4 .4 
సిద్ధిపేట :        3 .8  
- సూర్యాపేట :  4 .2 
- జగిత్యాల : 3 .9 
- భద్రాద్రి కొత్తగూడెం : 3 .7 
- కరీం నగర్ : 3 .5 .
- వరంగల్ :  3 .3 
- మహబూబ్ నగర్ : 3 .2 
- వికారాబాద్ :   3 .1
- మహబూబాబాద్ : 3 .1 
- కామారెడ్డి :   3 .1 
- హనుమకొండ:  2 .93 
- మంచిర్యాల :   2 .83 
- నిర్మల్ :  2 .80 
- మెదక్ :  2 .73 
- పెద్దపల్లి : 2 .69 
- యాదాద్రి బోనగిరి : 2 .54 
- ఆసిఫాబాద్ : 2 .20 
- రాజన్న సిరిసిల్ల : 2 .15 
- నారాయణ పెట్ :2 .09 
- నాగర్ కర్నూల్ : 2 .03 
- జోగులాంబ గద్వాల్  :1 .95 
- కొమురంభీం ఆసిఫాబాద్ : 1 .82 
- జయశంకర్ భూపాల్ పల్లి : 1 .46 
- ములుగు : 1 .10 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Embed widget