Top 10  News Today:


బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ దీపావళి బాంబులు?


గత  రెండు రోజులుగా జరిగిన పరిణామాలు ప్రారంభమేనని రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో వేధింపులు ఉంటాయని పోరాటానికి అందరూ సిద్దంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఖచ్చితమైన సమాచారం ఏదో లేకపోతే ఆయన అలా ట్వీట్ చేసి ఉండరని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


శంషాబాద్‌లో 3 విమానాలకు బాంబు బెదిరింపు


దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు ఆగడం లేదు. తాజాగా శంషాబాద్‌ విమానాశ్రయంలోని  మూడు విమానల్లో బాంబులు ఉన్నట్టు  బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు మూడు విమానాలను ఆపిన అధికారులు తనిఖీలు చేపట్టారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


 


విజయమ్మ లేఖపై స్పందించిన వైసీపీ

 షర్మిల - జగన్ ఆస్తులపై విజయమ్మ రాసిన లేఖపై వైసీపీ స్పందించింది. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాసింది. విజయమ్మ రాసిన లేఖలో జగన్‌ బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని ప్రస్తావించకపోవడం ప్రజలను పక్కదోవపట్టించడమే అవుతుందన్నారు.  షర్మిల ఒత్తిళ్లకు లొంగి విజయమ్మ ఇలా వ్యవహరించారని ఆరోపించారు.   రచ్చకెక్కింది, పరువు తీసింది ఎవరని ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

మొబైల్స్ రికవరీలో అనంతపురం పోలీసులు రికార్డు

అనంతపురం పోలీసులు మొబైల్స్ రికవరీలో సరికొత్త రికార్డు సృష్టించారు. పది వేలకు పైగా సెల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందజేశారు. వీటన్నింటి విలువ సుమారు రూ 18.85 కోట్లు.  అంతే కాదు ఏకంగా రికవరీ మొబైల్ ఫోన్ల మేళా నిర్వహించి... రూ.3.45 కోట్ల విలువ చేసే 1309 మొబైల్ ఫోన్లు బాధితులకు జిల్లా ఎస్పీ జగదీష్ అంచించారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


కేసీఆర్ వైపు కాళేశ్వరం కేసు  


 కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌కు ఇందులో కేసీఆర్ పాత్రపై  కీలకమైన ఆధారాలు లభించాయని ప్రచారం ఊపందుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహించిన నల్లా వెంకటేశ్వర్లు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను న్యాయ విచారణ కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌కు అందజేశారని సమాచారం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


తెలంగాణ  పోలీసులకు శుభవార్త


తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు శుభవార్త  చెప్పింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ లకు సంబంధించిన బడ్జెట్ ను  విడుదల చేసింది. 182.48 కోట్ల రూపాయల మొత్తాన్ని పోలీస్ సిబ్బందికి మంజూరు చేస్తూ  ఆర్థిక శాఖ మంగళవారం నాడు ఉత్తర్వులను జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



మహారాష్ట్ర ఎన్నికలు..  మద్దతుగా ఏపీ నేతలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు మంగళవారంతో ముగిసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 7,995 మంది అభ్యర్థులు 10,905 నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు జరగనుండడంతో  ఏపీ బీజేపీ నేతలు  సైతం అక్కడ చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



భారతీయ మూలాలున్న ఓటపై  ట్రంప్, కమలా ఫోకస్ 



భారత మూలాలున్న ఓటర్లు ఇప్పుడు అమెరికాలో కీలకంగా మారారు. అమెరికాలోని భారతీయుల్లో ఎక్కువ మంది డెమొక్రటిక్ పార్టీ, దాని అనుబంధ సంస్థలలో పని చేస్తున్నారు. అందుకే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా భారతీయ మూలాలున్న వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

స్పేస్ నుంచి సునీత దీపావళి   విషెస్

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన  దీపావళి వేడుకల  సందర్భంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సునీతా విలియమ్స్ పంపిన దీపావళి శుభాకాంక్షలు వీడియోను వైట్ హౌస్ ప్రదర్శించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 



స్మృతి మంథాన అరుదైన రికార్డు

న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంథాన సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో స్మృతి ఓ అరుదైన రికార్డును అందుకున్నారు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు (8) చేసిన మహిళా క్రికెటర్‌‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో మిథాలీ రాజ్(7), హర్మన్ ప్రీత్ కౌర్(6) ఉన్నారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 10 సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మంథాన నిలిచారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..