Trump and Kamala Harris : అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండే డాలస్ సిటీలో తెలుగులో కూడా ప్రచార పోస్టర్లు వేశాయి ప్రధాన పార్టీలు. అటు డొనాల్డ్ ట్రంప్ , ఇటు కమలా హ్యారిస్ ఇద్దరూ పోటాపోటీగా ప్రవాస భారతీయుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మెక్ డొనాల్డ్స్ లో పని చేసి ప్రచారం చేసిన ట్రంప్ ఓ భారతీయ అమెరికన్‌కు ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్మిన వీడియోను విస్తృతంగా ప్రచారం అయ్యేలా చేసుకున్నారు.
భారత మూలాలున్న ఓటర్లు ఇప్పుడు అమెరికాలో కీలకంగా మారారు. అమెరికాలోని భారతీయుల్లో ఎక్కువ మంది డెమొక్రటిక్ పార్టీ, దాని అనుబంధ సంస్థలలో పని చేస్తున్నారు. ప్యూ సర్వే ప్రకారం 68 శాతం రిజిస్టర్డ్ భారతీయ అమెరికన్ ఓటర్లు డెమొక్రటిక్ పార్టీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుబంధం కొనసాగిస్తున్నారు. కేవలం 29శాతం మాత్రమే రిపబ్లికన్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. అందుకే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా భారతీయ మూలాలున్న వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
జర్మనీ విదేశాంగ మంత్రి వస్తే స్వాగతం చెప్పడానికి ప్యూన్‌ని కూడా పంపలేదు - చైనా ఇంత ఘోరమా ?
అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వారికి పౌరసత్వం లభిస్తుంది. వారి తల్లిదండ్రులు ఏ దేశానికి చెందిన వారు అయినా అమెరికాలో పుడితే పౌరసత్వం తీసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా నిబంధనల ప్రకారం వయసు రాగానే ఓు హక్కు వస్తుంది. అలాగే గ్రీన్ కార్డు పొందిన వారికి కూడా ఓటు ఉంటుంది. ఇలా వేరేదేశాల్లో పుట్టి అమెరికాలో సెటిల్ అయిన వారికి పౌరసత్వం పొందిన వారికి అధ్యక్ష స్థానానికి పోటీ చేసే అవకాశం ఉండదు. కానీ రాష్ట్రాల్లో గవర్నర్ పోస్టుల వరకూ పోటీ చేయవచ్చు. మంత్రులుగా బాధ్యతలు తీసుకోవచ్చు. భారతీయలు ఈ అవకాశంతో కింది స్థాయి నుంచి ఎన్నికల్లో పోటీ చేసి పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే ప్రపంచం మొత్తానికి ఆసక్తి ఉంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వెళ్లిన జనం అమెరికాలో జీవిస్తూ ఉంటారు. అందుకే అక్కడి ఎన్నికలపై ఎంతో ఉత్సుకత ఉంటుంది. అది రాను రాను పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ స్థిరపడిన విదేశీయులు ఓటర్లుగా మారడమే కాదు.. ఇప్పుడు ఆ దేశాన్ని పరిపాలింటే వారిలో భాగం అవుతున్ననారు. ఈ విషయంలో భారతీయులు చాలా ముందు ఉన్నారు. ఒకటి, రెండు తరాలకిందట వెళ్లిన వారు అమెరికా పౌరులుగా మారి నేరుగా పరిపాలన చేయడానికే పోటీ పడుతున్నారు. కమలాహ్యారిస్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా పోటీ చేస్తూండటం భారతీయ మూలాలున్నవారిని మరింత ఉద్వేగానికి గురి చేస్తోంది. అధ్యక్ష పదవికి పోటీ చేసేలా ఓ భారత మూలాలున్న నేత ఎదిగారంటే ఇక కింది స్థాయిలో వారు ఎంత ప్రభావిత స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
గూగుల్‌పై కోర్టుకెళ్లి రూ.26 వేల కోట్ల పరిహారం పొందుతున్నారు - ఈ యూకే జంట పంట పండినట్లే !
డొనాల్డ్ ట్రంప్ విధానాలు భారతీయుల్ని కొంత వరకు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అయితే గతంలో ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదని ఈ సారి కూడా ఎదురు కావని చెప్పి రిపబ్లికన్ పార్టీ మద్తతు దారులు ప్రచారం చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఇండియన్స్ ఎవరి వైపు నిలబడతారన్నది ఎన్నికల ఫలితాల్లో తేలుతుంది.