AP BJP leaders are actively campaigning in Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. బీజేపీ అన్ని రాష్ట్రాల నుంచి సమర్థులైన నేతల్ని పరిశీలకులుగా నియమించి అభ్యర్థులకు అండదండలు అందిస్తోంది. ఈ క్రమంలో ఏపీ నుంచి కూడా ముగ్గురు కీలక నేతలకు పరిశీలకులుగా చాన్స్ ఇచ్చారు. వీరిలో ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డిని నాందెడ్ జిల్లాకు పరిశీలకునిగా నియమించారు.           


ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !


తెలుగువారి ప్రభావం కాస్త ఎక్కువగా ఉండే నాందేడ్ జిల్లాలో విష్ణువర్ధన్ రెడ్డి పరిశీలకుడిగా నియమిచినప్పటి నుండి విస్తృతంగా పర్యటిస్తున్నారు. నామినేషన్ల కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. మరోసారి మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలుస్తుందని.. ప్రజల్లో ఆ స్థాయిలో స్పందన ఉందని చెబుతున్నారు.                                            



యాపి‌ల్ సంస్థకు లోకేష్ భారీ అఫర్‌- ఏపీలో కోరుకున్న చోట స్థలం ఇచ్చేందుకు అంగీకారం


బీజేపీలో పరిశీలకుడి బాధ్యతలు కీలకమైనవి. అభ్యర్థి ప్రత్యక్ష ప్రచారంతో పాటు ఓటర్లను బూత్‌ల వద్దకు తీసకెళ్లేలా చేయడంలో ప్రధాన పాత్రపోషించే ఎలక్షనీరింగ్ వ్యూహాలను కూడా ఖరారు చేస్తారు. అమలు చేసేలా బీజేపీ క్యాడర్ సిద్ధం చేస్తారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న అనుభవం ఉన్న విష్ణువర్దన్ రెడ్డి నాందెడ్ జిల్లాలో బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసేలా ప్రయత్నిస్తున్నారు.            





మరో సీనియర్ నేత ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో పాటు, మధుకర్ కూ కూడా పరిశీలకులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే వరకూ వారు తమ కు కేటాయించిన జిల్లాల్లోనే ఎన్నికల సన్నాహాల్లో పాల్గొంటారు.