Warangal Betting Apps | వరంగల్: బెట్టింగ్‌ యాప్‌లతో నష్టపోయి చివరికి దొంగా మారి చోరీలకు పాల్పడతున్న వ్యక్తిని వరంగల్ కమిషనరేట్ పోలీస్ లు అరెస్ట్ చేశారు. వరంగల్ కమీషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ అంబర్ కిషోర్ ఝ మాట్లాడుతూ.. అరెస్ట్ అయిన నిందితుడి వద్ద నుంచి 28 లక్షల 50 వేల విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. అందులో 334 గ్రాముల బంగారు, ఒక కిలో 640 గ్రాముల వెండి, రూ. 13వేల నగదు, ఒక బైక్, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.


వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన కొండపల్లి ధర్మరాజు డిగ్రీ పూర్తి చేసి ధర్మరాజు చేసి రాయపర్తిలో బిర్యానీ సెంటర్ ప్రారంభించాడు. వ్యాపారంలో నష్టం రావడంతో హనుమకొండకు మకాం మార్చాడు. హనుమకొండ పోస్టల్‌ కాలనీలో విద్యార్థినని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. నిందితుడు వివిధ మార్గాల్లో వ్యక్తిగత రుణాలు తీసుకొని అన్‌లైన్‌ బెట్టింగ్‌ అడటం మొదలుపెట్టాడు. నిందితుడు నష్టపోయి, తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించలేక పూర్తిగా అప్పులయ్యాడు. దీంతో నిందితుడు తన అప్పులను తీర్చడంతో పాటు సులభం  డబ్బు సంపాదించాలనికొని దొంగతనాలను మార్గంగా ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు సీపీ చెప్పారు.


పగలు రెక్కీ, రాత్రి చోరీ..


ద్విచక్ర వాహనంపై వెళ్లి రెక్కీ నిర్వహిస్తూ పగటి సమయాల్లో తాళం వేసి వున్న ఇళ్లను టార్గెట్ చేస్తాడు. రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడేవాడు. ఇదే పద్ధతిలో నిందితుడు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం17 చోరీలకు పాల్పడగా ఇందులో కెయూసి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 8, హనుమకొండ, హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రెండు, సుబేదారి, సంగెం, ఘన్‌పూర్‌, పాలకుర్తి, దేవరుప్పుల పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చోరీలకు పాల్పడట్లు సీపీ అంబర్ కిషోర్ ఝ తెలిపారు. ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలు పోలీసుల వద్ద వున్న అధునిక టెక్నాలజీని వినియోగించుకోని నిందితుడుని గుర్తించడంతో పాటు అతనిపై నిఘా పెట్టారు.


నిందితుడు చోరీ చేసిన చోరీ సోత్తు అమ్మేందుకు వాహనంపై కెయూసి వైపు వెళ్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దాంతో సిసిఎస్‌, కెయూసి  పోలీసులు కెయూ క్రాస్‌లో వాహన తనీఖీల్లో నిందితుడు పోలీసులు పట్టుపడటంతో విచారణలో నిందితుడు చోరీలకు పాల్పడినట్లు నేరాలను అంగీకరించినట్లు కమిషనర్ చెప్పారు. నిందితుడు ధర్మరాజు దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు.


Also Read: Family Survey In Telangana: తెలంగాణలో ఫ్యామిలీ సర్వేలో అడిగే సమాచారం ఇదే- ఏ పార్టీలో సభ్యత్వం ఉందో చెప్పాలట!