ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిథిగా వచ్చిన ఎపిసోడ్‌తో నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' షో నాలుగో సీజన్ మొదలైంది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయడానికి ఆహా ఓటీటీ రెడీ అవుతుంది. అది ఎప్పుడో తెలుసా?


బాలయ్య షోకి లక్కీ భాస్కర్ టీమ్!
మలయాళ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటుడు, 'మహానటి', 'కల్కి 2898 ఏడీ' సినిమాతో మనందరికీ దగ్గరైన దుల్కర్ సల్మాన్ నటించిన తాజా సినిమా 'లక్కీ భాస్కర్'. ఆ సినిమా టీం 'అన్‌స్టాపబుల్ 4' షోకి వచ్చింది. ఆ ప్రోమో లేటెస్టుగా విడుదల చేశారు.



'లక్కీ భాస్కర్' సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ - త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మించారు. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. హీరో దుల్కర్ సల్మాన్ సహా మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరి, నాగవంశీ 'అన్‌స్టాపబుల్ 4' షోకి వచ్చారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన రాత్రి 7 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.


Also Read: చిరంజీవి లివింగ్ లెజెండ్... మెగాస్టార్ స్పీచ్ తర్వాత నాగార్జున ట్వీట్ వైరల్... ఏమన్నారో చూశారా?






దుల్కర్ సల్మాన్ అంత స్పీడ్ డ్రైవ్ చేశారా?
కార్లు అంటే ఇష్టం ఉన్న హీరోలలో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరు. ఈ మలయాళ హీరో దగ్గర లగ్జరీ కార్లతో పాటు స్పోర్ట్స్ కార్స్ కూడా కొన్ని ఉన్నాయి. అప్పుడప్పుడు రేసింగ్ ట్రాక్స్ మీద ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఒక సందర్భంలో ఆయన గంటకు 300 కోలోమీటర్ల స్పీడ్ తో కారును డ్రైవ్ చేశారట. ఆ విషయం బాలకృష్ణతో మాట్లాడుతున్న సందర్భంలో దుల్కర్ చెప్పినట్లు తెలిసింది. 


Also Readచైతన్య, శోభిత మీదే అందరి కళ్లు... ఆల్రెడీ అక్కినేని కోడలు హోదా, అదీ పెళ్ళికి ముందు!



శ్రీమతిని ఎప్పుడూ బాధ పెట్టలేదు... ఉన్నది ఒక్కటే హార్ట్!
దుల్కర్ సల్మాన్ హీరోగా సినిమాల్లోకి రావడానికి కంటే ముందు పెళ్లి చేసుకున్నారు. ఈ హీరో భార్య పేరు అమల్ సూఫియా. శ్రీమతితో తన అనుబంధం గురించి, తమ మధ్య ఉన్న రొమాంటిక్ హిస్టరీ గురించి బాలకృష్ణతో సరదా సంభాషణలలో దుల్కర్ సల్మాన్ బయట పెట్టారు. తన దగ్గర ఒక్కటే హార్ట్ ఉందని, అది తన భార్యకు ఇచ్చేశానని, అమల్ హార్ట్ ఎప్పుడు బ్రేక్ చేయలేదని దుల్కర్ తెలిపారు. కుటుంబానికి విలువ ఇచ్చే అతనికి బాలకృష్ణ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. అక్టోబర్ 30న 'లక్కీ భాస్క' ప్రీమియర్ షోలు పలు థియేటర్లలో పడుతున్నాయి. ఇక, ఈ నెల 31న  వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత ఈ షో స్ట్రీమింగ్ కానుంది.